E-Paper
Advertisement

రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. డస్టర్‌పై ఏకంగా రూ.2.10 లక్షల బెనిఫిట్స్!

రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. డస్టర్‌పై ఏకంగా రూ.2.10 లక్షల బెనిఫిట్స్!
Advertisement

Renault Car Discounts November 2026: కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి రెనాల్ట్ (Renault) గుడ్ న్యూస్  చెప్పింది. నవంబర్ 2026 నెలకు సంబంధించి తన కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్, ఇతర బెనిఫిట్స్ ప్రకటించింది. ముఖ్యంగా రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేసేవారికి గరిష్టంగా రూ.2.10 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. కిగర్, ట్రైబర్, క్విడ్ మోడళ్లపైనా భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు నవంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

డస్టర్‌పై రూ.2.10 లక్షల వరకు బెనిఫిట్స్

రెనాల్ట్ ఇండియా లైనప్‌లో అత్యధిక బెనిఫిట్స్ డస్టర్‌పై అందిస్తోంది. టెక్నో+ (Techno+), ఐకానిక్ (Iconic) వేరియంట్లపై రూ.50,000 వరకు క్యాష్ డిస్కౌంట్, 4.99 శాతం వడ్డీతో ప్రత్యేక EMI ఆప్షన్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ వేరియంట్లపై రూ.1.50 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 వరకు లాయల్టీ బోనస్ కూడా పొందవచ్చు. పాత కారును ఎక్స్ఛేంజ్ చేయడానికి బదులుగా స్క్రాప్ చేస్తే రూ.25,000 వరకు స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. అయితే, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ రెండింటినీ కలిపి పొందలేరు. డస్టర్ ధరలు రూ.10.49 లక్షల నుంచి రూ.19.49 లక్షల వరకు ఉన్నాయి.

కిగర్‌పై రూ.65,000 వరకు తగ్గింపు

Advertisement

రెనాల్ట్ కిగర్ కొనుగోలుదారులకు రూ.65,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. వీటితో పాటు రూ.10,000 వరకు లాయల్టీ బోనస్ లభిస్తుంది. అర్హులైన కస్టమర్లకు రూ.5,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. కిగర్ ధరలు రూ.5.81 లక్షల నుంచి రూ.10.40 లక్షల మధ్య ఉన్నాయి.

ట్రైబర్‌పై రూ.55,000 వరకు ఆఫర్లు

కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఉండే రెనాల్ట్ ట్రైబర్ MPVపై రూ.55,000 వరకు బెనిఫిట్స్ ప్రకటించింది. ఇందులో రూ.25,000 వరకు నగదు తగ్గింపు, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అదనంగా కార్పొరేట్ కస్టమర్లకు రూ.5,000 వరకు, గ్రామీణ ప్రాంత కొనుగోలుదారులకు రూ.4,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ట్రైబర్ ధరలు రూ.5.81 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉన్నాయి.

క్విడ్‌పై రూ.40,000 వరకు బెనిఫిట్స్

Advertisement

బడ్జెట్ కారుగా గుర్తింపు పొందిన రెనాల్ట్ క్విడ్‌పై రూ.40,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.15,000 వరకు నగదు తగ్గింపుతో పాటు, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్ పొందవచ్చు. క్విడ్ ధరలు రూ.4.53 లక్షల నుంచి రూ.5.61 లక్షల మధ్య ఉన్నాయి.

నవంబర్ 30 వరకే అవకాశం!

ఈ ఆఫర్లు నవంబర్ 30, 2026 వరకు మాత్రమే వర్తిస్తాయి. సిటీ, డీలర్‌షిప్, వెహికల్ స్టాక్‌ను బట్టి బెనిఫిట్స్ మారే అవకాశం ఉంటుంది. కారు కొనుగోలు చేసే ముందు  రెనాల్ట్ షోరూమ్‌ కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

Read Also:టయోటా ఫార్చ్యూనర్ ధరలు భారీగా పెంపు.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?

Tags

Related News

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధరలు పెరిగాయ్.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?

టయోటా ఫార్చ్యూనర్ ధరలు భారీగా పెంపు.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?

టీవీఎస్ ఎన్‌టార్క్ 150కు కొత్త లుక్.. స్పెక్ట్రల్ గ్రీన్ కలర్ భలే ఉంది భయ్యా!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. టిగువాన్‌పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

అక్టోబర్ EV సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. టాప్ 5 కంపెనీల్లో ఎవరు ముందున్నారు?

భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ MPV.. తొలిసారిగా కనిపించిన డెంజా D9!

ఏథర్ సరికొత్త రికార్డు.. ఒకే ఏడాదిలో 3 లక్షల స్కూటర్ల అమ్మకాలు!

Big Stories

Advertisement
×