Eesha Rebba:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు జంటగా కనిపిస్తే చాలు వారి మధ్య రూమర్స్ క్రియేట్ అవ్వడం సహజమే. అయితే ఒక్కొక్కసారి ఆ రూమర్స్ నిజం అవుతూ.. అదే సెలబ్రిటీలు దంపతులుగా మారుతున్నారు. అలా దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా ఒకరినొకరు ప్రేమించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) ఈ ఏడాది రహస్యానికి ముగింపు పలుకుతూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరి జాడల్లోనే మరో జంట కూడా నడుస్తోంది. వారెవరో కాదు ప్రముఖ డైరెక్టర్ కం నటుడు తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) హీరోయిన్ ఈషా రెబ్బ (Eesha Rebba). గత కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్న ఈ జంట కలిసి పండుగలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఇంకా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.
వాస్తవానికి గత ఏడాది దీపావళి సందర్భంగా ప్రముఖ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) ఇంట జరిగిన దీపావళి వేడుకల్లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా కనిపించి.. రూమర్స్ కి చోటిచ్చారు. తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకల్లో కూడా ఈ జంట కనిపించి, రూమర్స్ కి మరింత బలం చేకూర్చారు. అంతేకాదు తిరుగు ప్రయాణంలో ఈషా రెబ్బ లగేజ్ ను తరుణ్ భాస్కర్ తీసుకురావడం కూడా వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇక వరలక్ష్మీ వ్రతం వేడుకలను మొదలుకొని.. నిన్న జరిగిన దీపావళి వేడుకల వరకు ప్రతి పండుగను వీరిద్దరూ కలిసి సెలెబ్రేట్ చేసుకోవడంతో రూమర్స్ మరింత వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరూ కలిసి దీపావళి వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ తో ఈసారి చేసుకున్న ఈ దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియోని ఆమెను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకోగా.. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ జంట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తరుణ్ భాస్కర్ ఇంట జరిగిన ఈ దీపావళి వేడుకల్లో తరుణ్ భాస్కర్ ఫ్యామిలీతో పాటు సీనియర్ సినీ హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ తో పాటు మరి కొంతమంది సెలబ్రిటీలు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో..” ఇప్పటికైనా అఫీషియల్ చేయండి. ఇంకెన్నాళ్లు ఈ దాపరికం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో సినీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఒకవైపు హీరోగా.. మరొకవైపు దర్శకుడిగా బిజీగా మారిన తరుణ్ భాస్కర్.. ఇటీవల క్రేజీ కల్యాణం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ కీలకపాత్ర పోషించి ఆకట్టుకున్నారు. మరొకవైపు ‘ఈ నగరానికి ఏమైంది? రిపీట్’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తులాభారం చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రదీప్ రంగనాథన్ చిత్రంతో తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా.. తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో నెగిటివ్ పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
also read:మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్న కిరణ్-రహస్య.. వైరల్ న్యూస్ లో నిజమెంత?
చివరిగా తరుణ్ భాస్కర్ తో కలిసి ఓం శాంతి శాంతిః చిత్రంలో నటించిన ఈమె అటు 3 రోజెస్ సీజన్ 2 లో కూడా నటించింది. ఈ రెండు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే తన కొత్త ప్రాజెక్టు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
?utm_source=ig_web_copy_link&vrfl=NTc4MTIwNjQ2YQ==