Pawan Kalyan:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. అటు ఆంధ్రప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వ్యక్తిగతంగా ఆయన తీసుకున్న నిర్ణయం జనసేన కార్యకర్తల్లో , అభిమానులలో.. అటు రాజకీయంగా ఇటు సినీవర్గాలలో ఈ విషయం సంచలనంగా మారింది. ముఖ్యంగా తన భార్య అన్నా లెజినోవాతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణం.
పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఈ నిర్ణయం వెనుక ఉన్న స్పష్టమైన, వ్యక్తిగత కారణాలను మాత్రం వీరు బయట పెట్టలేదు. ఎంతోకాలంగా తాము ఇద్దరం కలిసి ఉన్నామని, అయితే పరస్పర అవగాహన, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము అని, ఇలాంటి క్లిష్ట సమయంలో తమ గౌరవాన్ని కాపాడుతూ.. తమ గోప్యతకు భంగం కలిగించవద్దని అభిమానులను, మీడియాను కోరారు ఈ జంట. అయితే ఎందుకు విడిపోతున్నారు అనే విషయాన్ని ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రాజకీయాలలో విపరీతంగా బిజీ అయిపోయారు. అన్నాతో వ్యక్తిగతంగా గడపడానికి సమయం దొరకలేదని, ఈ విషయంలోనే ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. రష్యాకు చెందిన మాజీ మోడల్ అన్నా లెజినోవాతో 2011 లో వచ్చిన ‘తీన్మార్’ సినిమా షూటింగ్ సెట్లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారగా.. సుమారుగా రెండేళ్లపాటు అన్నా లెజినోవాతో ప్రేమలో మునిగితేలారు..2013 సెప్టెంబర్ 30న వీరిద్దరు వివాహం చేసుకున్నారు. హైదరాబాదులో ప్రత్యేక వివాహ చట్టం కింద ఈ జంట పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కంటే వయసులో దాదాపు 9 సంవత్సరాలు ఈమె పెద్దది కావడం విశేషం.. 2017లో ఈ దంపతులకు మార్క్ శంకర్ పవనోవిచ్ అనే బాబు జన్మించారు.
also read:తరుణ్ భాస్కర్ తో ఈషా ఇంట దివాళీ వేడుకలు.. ఇంకెన్నాళ్ళు?
రష్యాకు చెందిన అన్నా లెజినోవా వివాహం తర్వాత పెద్దగా ఇండియాలో కనిపించలేదు. కానీ 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తరచూ ఈమె వార్తల్లో నిలిచింది.వైవాహిక జీవితంలో సంతోషంగా, అన్యోన్యంగా కొనసాగుతున్న ఈ జంట 13 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత అనూహ్యంగా విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. పైగా పిల్లలకు అంకిత భావంతో ఉండే తల్లిదండ్రులుగా కొనసాగుతామని ప్రకటించారు.