E-Paper
Advertisement

మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్న కిరణ్-రహస్య.. వైరల్ న్యూస్ లో నిజమెంత?

మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్న కిరణ్-రహస్య.. వైరల్ న్యూస్ లో నిజమెంత?
Advertisement

Kiran – Rahasya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వెండితెరపై సందడి చేసి.. ఆ తర్వాత నిజజీవితంలో రియల్ జోడిగా పేరు సంపాదించుకున్న జంటలలో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram), రహస్య గోరక్ (Rahasya gorak)జంట కూడా ఒకటి. 2019లో తొలిసారి ‘రాజా వారు రాణి గారు’ అనే సినిమా సెట్స్ లో కలుసుకున్న వీరు.. ఐదేళ్లపాటు రహస్యంగా ప్రేమించుకున్నారు.2024 మార్చి 13న హైదరాబాదులో నిశ్చితార్థం చేసుకొని, అందరిని సర్ప్రైజ్ చేసిన ఈ జంట.. 2024 ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్ లో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకొని, అభిమానులను సంతోషపరిచారు.

మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్న కిరణ్-రహస్య..

అలాంటి ఈ జంట 2025 జనవరిలో తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించి, 2025 మే 22వ తేదీన పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది రహస్య. ఇక అప్పటినుండి తమ కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న స్వీట్ మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంటున్నారు ఈ జంట. ఇక నిన్న కూడా దీపావళి సందర్భంగా తమ కొడుకుతో కలిసి దీపావళి విషెస్ తెలియజేస్తూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. అయితే ఈ ఫోటోలు కాస్త వైరల్ అవ్వడంతో రహస్య గోరక్, కిరణ్ అబ్బవరం మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా రహస్య గోరక్, కిరణ్ అబ్బవరం తమ రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మళ్ళీ తల్లిదండ్రులు కాబోతున్న కిరణ్ అబ్బవరం రహస్య దంపతులకు అభిమానులు , శ్రేయోభిలాషులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వైరల్ వార్తలలో నిజమెంత?

Advertisement

ఇకపోతే వీరిద్దరూ మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉంది? అనే విషయంపై క్లారిటీ లేదు. అటు రహస్య కానీ ఇటు కిరణ్ కానీ ఎవరూ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీపావళి సందర్భంగా షేర్ చేసిన స్పెషల్ ఫోటోలలో రహస్య బేబీ బంప్ తో కనిపించిందని , త్వరలోనే వీరు ముగ్గురు కాస్త నలుగురు కాబోతున్నారని నెటిజన్లు పలు రకాల ఊహాగానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

also read: నరేష్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈ ట్విస్ట్ ఏంటి సామి!

కిరణ్ అబ్బవరం చిత్రాలు..

Advertisement

గత కొన్ని సంవత్సరాలుగా వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు ‘రియాలిటీ’ అనే షో తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్న ఈ చిత్రానికి కిరణ్ అబ్బవరం రచయితగా, దర్శకుడిగా కూడా పనిచేస్తుండడం గమనార్హం. తెలుగు ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో దేవిక భట్, శరత్ కుమార్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వంలో జీ.స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియన్ పౌరాణిక యాక్షన్ ఫాంటసీ చిత్రం ఇంద్రపుత్రలో కూడా ఈయన నటిస్తున్నారు. అలాగే ‘గువ్వల చెరువు ఘాట్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు కిరణ్ అబ్బవరం.

Related News

తెలుగు రికార్డులను తిరగరాస్తున్న వారణాసి మూవీ!

అన్నాతో పవన్ కళ్యాణ్ విడాకుల వార్తలు.. వైరల్ అవుతున్న వేణుస్వామి కామెంట్స్!

పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులు.. అసలేం జరిగింది..?

తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో సమంత మెటర్నటీ ఫోటోషూట్!

నేను ‘చిరులీక్స్ ‘ లాగా కాదు..కాకాలో అనస్వర క్యారెక్టర్ లీక్ చేసిన చరణ్?

సినిమా రిలీజ్ డేట్ మర్చిపోయిన అనస్వర… మర్చిపోవడంలో తప్పులేదులే?

కావ్య అనిరుద్ వెడ్డింగ్.. రిసార్ట్ ఒక్క రోజు అద్దె ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×