E-Paper
Advertisement

తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో సమంత మెటర్నటీ ఫోటోషూట్!

తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో సమంత మెటర్నటీ ఫోటోషూట్!
Advertisement

Samantha Baby Bump: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) అతి త్వరలోనే అమ్మగా ప్రమోట్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈమె గత ఏడాది డిసెంబర్లో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇలా రెండోసారి పెళ్లి చేసుకున్న ఈమె పెళ్లయిన వెంటనే అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. సమంత ప్రెగ్నెంట్ (Samantha Pregnant) అనే విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు అభినందనలు తెలిపారు. ఇలా తన ప్రేగ్నెన్సీ విషయాన్ని తెలియచేసినప్పటి నుంచి సమంత ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

9 నెలల గర్భంతో సమంత..

ఇకపోతే ఈమె తరచూ తన బేబీ బంప్(Baby Bump) ఫోటోలను షేర్ చేస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున వర్కౌట్స్ కూడా చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇలా నెలలు నిండినప్పటికీ సమంత సినిమాలకు దూరమైన బుల్లితెర కార్యక్రమాలలో మాత్రం సందడి చేస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే సమంత తనకు సంబంధించి అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె తన బేబీ బంప్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 9 నెలల గర్భంతో సమంత బేబీ బంప్ కనిపించేలా టాప్ పైకి లేపి దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సంచలనం గా మారింది.

మెటర్నటి ఫోటోషూట్ ఇదే అనుకోండి..

Advertisement

ఇలా తన తొమ్మిదవ నెలకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోని సమంత షేర్ చేస్తూ.. ఈ ఫోటోనే నా మేటర్నరీ ఫోటోషూట్ (maternity Photoshoot) అని భావించండి క్యాప్షన్ ఇచ్చారు. ఇలా రిలాక్స్ మోడ్ లో సమంత చిల్ అవుతూ దిగిన ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. సాధారణంగా సెలబ్రిటీలు మెటర్నటీ ఫోటో షూట్ చాలా ఘనంగా జరుపుకుంటారు కానీ సమంత మాత్రం ఎంతో విభిన్నంగా ఎంతో సహజంగా, ఎటువంటి హంగులు లేకుండా షేర్ చేసిన ఈ క్యాజువల్ పిక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటో షేర్ చేసిన కొంత సమయానికి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Advertisement

ఇక సమంత అతి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తుంది అయితే ఈమె ఎవరికీ జన్మనివ్వబోతున్నారు అనే విషయంపై అభిమానులు ఆత్రుత కనబరుస్తున్నారు. అయితే సమంతకు కవల పిల్లలు జన్మించబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సమంత ఎవరికి జన్మనివ్వబోతున్నారు అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సి ఉంది. సమంత కెరీర్ విషయానికి వస్తే ఈమె ఇటీవల మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన సొంత నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 100 కొట్టకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

Also Read: నేను ‘చిరులీక్స్ ‘ లాగా కాదు..కాకాలో అనస్వర క్యారెక్టర్ లీక్ చేసిన చరణ్?

Related News

నేను ‘చిరులీక్స్ ‘ లాగా కాదు..కాకాలో అనస్వర క్యారెక్టర్ లీక్ చేసిన చరణ్?

సినిమా రిలీజ్ డేట్ మర్చిపోయిన అనస్వర… మర్చిపోవడంలో తప్పులేదులే?

కావ్య అనిరుద్ వెడ్డింగ్.. రిసార్ట్ ఒక్క రోజు అద్దె ఎంతో తెలుసా?

మూడు రోజుల్లో 500 కోట్లు.. మరి రూ.5వేల కోట్ల లెక్కేంటి..?

తమన్నాతో ఆ ఛాన్స్ నాకే వచ్చింది.. సునీల్ రెడ్డి ఫన్నీ కామెంట్స్’

ఒకే వేదికపై రామ్ చరణ్, నాగార్జున.. ఫ్యాన్స్‌కు పండగే!

యూసఫ్‌గూడలో చాలా ఆస్తులు సావిత్రి గారివేనా? ప్రేమ్ సాగర్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×