Ambati Rambabu: కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజక వర్గం కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు వైసీపీ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు హజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడారు. పోలీసుల నోటీసుల మేరకు కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యానని, రాజకీయ కక్ష సాధింపులకు పోలీసు వ్యవస్థను వేదికగా మార్చుకున్నారని అన్నారు.
అంతర్జాతీయ తీవ్రవాదిని విచారించిన తరహాలో పోలీసులు ప్రశ్నలు అడిగారని అన్నారు. కేసులకు భయపడేది లేదు.. న్యాయపోరాటం చేస్తానని అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసుల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారు. మీడియా ప్రతినిదీ అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ విడాకుల అంశం పూర్తిగా వ్యక్తిగతం అని దానిపై వ్యాఖ్యానించను అని అన్నారు. పోలీస్ స్టేషన్‌లకు రావడం నాకు కొత్తేమీ కాదు. ముద్రగడ గార్డ్ ఆప్ హానర్ అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. అందుకే పోలిసుల గౌరవ వందనం అడ్డుకున్నామని క్లారిటీ ఇచ్చారు. మేము ఎలాంటి నేరం చేయలేదని అన్నారు.
జూలై 15న కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబుపై కేసు నమోదు అయింది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న సమయంలో అంబటి రాంబాబు, ఇతర వైసీపీ నేతలు అడ్డుకున్నారనే ఆరోపణలు చేస్తూ ఆ సమయంలో పోలీసులను అడ్డుకుని నెట్టివేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై కేసు నమోదు చేసారు.
Also Read: ఏపీ ఎంపీపీ, జడ్పీ అధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!