Big Breaking : తెలుగు స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లేజీనోవాతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలను అటు రాజకీయాలోనూ హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ పరస్పర అంగీకారాంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు ఒక ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చెయ్యడంతో ఈ వార్త పెద్ద దుమారం రేపుతుంది. ఏపీకి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా విడాకులు ప్రకటించడంపై ఆయన అభిమానులు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరితో విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడోసారి కూడా విడాకులు తీసుకోవడంపై చర్చ జరుగుతుంది అసలు ఏం జరిగింది? ఎందుకు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకున్నారు? వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడానికి అతిపెద్ద కారణమేంటి?అన్న ప్రశ్నలు ఇప్పుడు అభిమానులు వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు విడాకులు తీసుకున్నారో అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాలు తెలుసుకుందాం..
ఏపీ రాష్ట్రానికి బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్, తన భార్య లేజీనోవాతో ఎందుకు విడాకులు తీసుకున్నారు. అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ఒక ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. మేము పరస్పర అంగీకారం, అవగాహనతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. జీవితంలో ఎంతోకాలం కలిసి ప్రయాణించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. మా వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నాం. విడిపోయినా మంచి స్నేహితులుగా కొనసాగుతాం. పిల్లల తల్లిదండ్రులుగా మా బాధ్యతలు కొనసాగిస్తాం. పిల్లల సంతోషం, భవిష్యత్తే మా ఇద్దరి ఉమ్మడి ప్రాధాన్యత.. మా విడాకులకు కారణం ఏంటి అనేది గొప్యంగా ఉంచాం. మా ఈ దాంపత్య బంధంలో అండగా నిలిచిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. మరి పవన్ కళ్యాణ్ విడాకులపై మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవుతారేమో చూడాలి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో నందిని అనే ఆవిడతో విడాకులు తీసుకున్నారు. ఆమె పవన్ కళ్యాణ్ కు మొదటి భార్య. ఆ తర్వాత హీరోయిన్ రేణు దేశాయ్ నేను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కూడా కొన్ని అనివార్య కారణాలవల్ల విడాకులు తీసుకుంటున్నారు. మొత్తానికి రెండు సార్లు విడాకులు తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడోసారి కూడా విడాకులు తీసుకోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. భారతీయ సాంప్రదాయాలను సంస్కృతులను గౌరవిస్తూ వచ్చిన అన్నా లేజీనోవా విడాకులు ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడోసారి విడాకులు తీసుకోవడం అటు సోషల్ మీడియాలోనూ, ఇటు రాజకీయాలోనూ హాట్ టాపిక్ గా మారింది.