E-Paper
Advertisement

రూ.100 కోట్ల ఆస్తి.. ఊహించని స్టార్డం.. అయినా నోకియా ఫోన్ వాడుతున్న పోసాని.. అసలు కథేంటంటే?

రూ.100 కోట్ల ఆస్తి.. ఊహించని స్టార్డం.. అయినా నోకియా ఫోన్ వాడుతున్న పోసాని.. అసలు కథేంటంటే?
Advertisement

Posani Krishna Murali:ఈ డిజిటల్ యుగంలో చిన్నపిల్లల్ని మొదలుకొని.. పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ కంపల్సరీ అయిపోయింది. ముఖ్యంగా బ్రతకడానికి ఆహారం, నీరు, గాలి ఎంత అవసరమో స్మార్ట్ ఫోన్ కూడా అంతే అవసరం అంటోంది నేటి యువత. అయితే ఇలాంటి జనరేషన్లో కూడా వందల కోట్ల ఆస్తి ఉన్నా.. ఊహించని స్టార్ డం ఉన్నప్పటికీ కూడా ఇంకా 2 వేల రూపాయల విలువచేసే నోకియా ఫోన్ వాడుతూ అందరిని ఆశ్చర్యపరిచారు ప్రముఖ రచయిత పోసాని కృష్ణ మురళి. తాజాగా స్వీయ దర్శకత్వంలో ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు జూలై 17వ తేదీన రాబోతున్నారు. పోసాని స్వీయ దర్శకత్వంలో హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్ తదితరులు నటిస్తున్నారు. అటు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఇప్పటికీ తాను నోకియా కీ ప్యాడ్ ఫోన్ వాడడం వెనుక అసలు విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

ప్రమోషన్స్ లో బిజీగా మారిన పోసాని..

చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న పోసాని అంటే విలక్షణమైన గొంతు.. ముక్కుసూటితనం గుర్తొస్తాయి. వివాదాలు చుట్టుముట్టినా సరే తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడమే ఆయన నైజం అని అందరికీ తెలిసిందే. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న పోసాని.. సినిమాలలోనే కాదు నిజజీవితంలోనూ అలాగే సమాజం పై, రాజకీయాలపై ఆయన చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ఉంటాయి. కల్మషం లేని వ్యక్తిగా మనసులో ఉన్నది దాచుకోకుండా మాట్లాడే మనస్తత్వం చిత్రసీమలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగించింది.

Advertisement

also read:విజయ్ ‘జన నాయగన్’ సినిమాలో మార్పులు.. ఆ సీన్స్ అన్నీ కట్!

రూ.100 కోట్ల ఆస్తి ఉన్నా నోకియా ఫోన్ వాడడంపై క్లారిటీ..

ఇటీవల బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడుతూ నోకియా ఫోన్ వాడడం వెనుక అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు. “నాకు నోకియా ఫోన్ అంటే చాలా ఇష్టం. ఎంత కొట్టినా అది పగలదు. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు నాకు ఈ కీప్యాడ్ ఫోన్ ఉపయోగించడం అంటే మరింత ఇష్టం.” అంటూ తన ఇష్టాన్ని చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా మనీ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ?ఎలా? అని అడిగితే..అవన్నీ మా అబ్బాయిలు చూసుకుంటారు అంటూ తెలిపారు. ఇకపోతే డిజిటల్ యుగంలో కూడా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ కి దూరంగా ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్ వాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు పోసాని కృష్ణమురళి.

ఆస్తిని భార్య పేరుపై రాయడానికి అసలు కారణం ఇదే..

Advertisement

ఇకపోతే మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రూ.100 కోట్ల ఆస్తిని తన భార్య పేరు మీద రాయడం వెనుక గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చారు. “రూ.100 కోట్ల ఆస్తి వెంట్రుకలతో సమానం. ఈరోజు ఉంటుంది రేపు ఊడిపోతుంది. నా ఆస్తి , కొడుకుల కంటే కూడా నా భార్య నాకు అతిపెద్ద ఆస్తి.. నా భార్య ఉంటే చాలు.. నాకు డబ్బు అక్కర్లేదు . ముఖ్యంగా నా భార్య తో సంవత్సరాలు తరబడి ఇంట్లోనే ఉన్నా ఎటువంటి బోర్ లేకుండా నేను ఉండిపోతాను. ఆమె అంటే నాకు అంత ఇష్టం.. అందుకే నా ఆస్తి మొత్తాన్ని ఆమె పేరు పైనే రాశాను” అంటూ క్లారిటీ ఇచ్చారు పోసాని. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.

Related News

నాగార్జున 100వ మూవీ నుండీ బిగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ , టైటిల్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

విజయ్ ‘జన నాయగన్’ సినిమాలో మార్పులు.. ఆ సీన్స్ అన్నీ కట్!

జిగేలు రాణిలా మెరిసిపోతున్న రాశిఖన్నా.. హీట్ పుట్టించే లుక్స్ తో!

తండేల్ ఇచ్చిన ధైర్యం.. భారీ స్థాయిలో వృషకర్మకు నాన్ థియేట్రికల్ బిజినెస్!

‘బేబీ’ సినిమా డబ్బులు ఇంకా రాలేదంటూ బాంబు పేల్చిన ఎస్కేఎన్!

టాక్సిక్ స్టోరీ చెప్పేసిన హీరో యశ్..ఈ ట్విస్ట్ ఏంటి గురూ!

హీరోగా లోకేష్ కనగరాజ్..DC కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్!

Big Stories

Advertisement
×