E-Paper
Advertisement

RCBలో టార్చ‌ర్ భ‌రించ‌లేక ఆత్మ‌హ‌**త్య చేసుకోవాలని అనుకున్నా

RCBలో టార్చ‌ర్ భ‌రించ‌లేక ఆత్మ‌హ‌**త్య చేసుకోవాలని అనుకున్నా
Advertisement

Uthappa:  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు (Royal Challengers Bangalore team) యాజమాన్యం అలాగే అందులో ఉన్న క్రికెటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప (Robin Uthappa). ఆర్సీబీ జట్టులో తాను కూడా పని చేశానని చెప్పిన రాబిన్ ఊతప్ప… అందులో ఇమడలేం అంటూ బాంబు పేల్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో చాలా జట్లకు తాను ప్రాతినిధ్యం వహించానని… కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లాంటి దరిద్రమైన జట్టును తాను ఎప్పుడు చూడలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో తాను టార్చర్ అనుభవించానని.. ఈ క్రమంలో ఆత్మహ**త్య చేసుకునేందుకు కూడా సిద్ధపడినట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రాబిన్ ఊత‌ప్ప‌ చేసిన వ్యాఖ్యలు దుమారం వెళుతున్నాయి.

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

RCBలో టార్చ‌ర్ భ‌రించ‌లేక ఆత్మ‌హ‌**త్య చేసుకోవాలని అనుకున్నా

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి రాబిన్ ఊతప్ప ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ లో తన కెరీర్ ముంబై ఇండియన్స్ తో ప్రారంభమైంది. ఆ తర్వాత ఏడాదికే అంటే 2009లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వెళ్ళాడు. అయితే ఈ జట్టులో తాను ఇమడలేక పోయానని… సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ తరఫున 2008 సీజన్ ఆడానని… ఆ తర్వాత తనను ట్రేడింగ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి పంపినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి ముంబై ఇండియన్స్ లో తాను పనిచేయాలని అనుకున్నానని… ఆ జట్టును తన హోమ్ లాగా ఫీల్ అయినట్లు వివరించారు. కానీ ముంబై ఇండియన్స్ యాజమాన్యం తనను వదిలించుకుందని బాంబు పేల్చాడు. మరో గతిలేక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తాను రెండు సీజన్ల పాటు ఆడినట్లు వెల్లడించారు. అయితే ఆ జట్టులో ఉండడం తనకు చాలా ఇబ్బందిగా మారిందని.. దానివల్ల ఆత్మహ**త్యకు కూడా ప్రయత్నం చేసినట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. కానీ చనిపోయేంత ధైర్యం లేక.. ఆగిపోయానని వివరించారు. ఆ జట్టులో యాజమాన్యం.. ఇతర క్రికెటర్ల వ్యవహారం తనకు నచ్చలేదన్నారు. తనను కూడా తొక్కేసినట్లు షాకింగ్ నిజాలను పంచుకున్నారు.

రాబిన్ ఊతప్ప IPL కెరీర్

Advertisement

2008లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రాబిన్ ఊతప్ప, ఆ తర్వాత బెంగుళూరు… అనంతరం పూనే వారియర్స్ ఇండియా జట్టులో ఆడాడు. కేకేఆర్ జట్టు తరఫున ఆడిన రాబి నువ్వు తప్ప అనంతరం రాజస్థాన్ రాయల్స్ కు వెళ్లాడు. ఇక 2021 నుంచి 2022 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ప్రాతినిధ్య వహించి అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. 2014 సంవత్సరంలో కేకేఆర్ జట్టు తరఫున ఆడిన రాబిన్ ఊతప్ప ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా నిలిచాడు.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

 

Related News

Video: లైవ్ మ్యాచ్ లో త‌న్నుకున్న‌ స్టీవ్ స్మిత్, కీరన్ పొలార్డ్

ప్రతిరోజూ 1000 బౌన్సర్లతో నా కొడుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు..వైభవ్ తండ్రి సంచ‌ల‌నం

బాడీగార్డ్ వెధ‌వ ప‌నులు..త‌ల‌దించుకున్న విరాట్ కోహ్లీ, ఇంత‌కు ఎవ‌రీ సోను ?

కోహ్లీ, గంభీర్ ఇద్ద‌రూ త‌న్నుకుంటుంటే..కుంభ‌క‌ర్ణుడిలా బీసీసీఐ నిద్ర‌పోతోంది!

IPLను దెబ్బ‌కొట్టేందుకు న‌ఖ్వీ భారీ ప్లాన్‌…PSL 2027 ప్రారంభంపై సంచ‌ల‌న నిర్ణ‌యం

శివుడి అవ‌తారమెత్తిన రోహిత్ శర్మ‌…ఫోటో చూపించిన దినేష్ కార్తీక్‌

కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

Big Stories

Advertisement
×