E-Paper
Advertisement

నాగార్జున 100వ మూవీ నుండీ బిగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ , టైటిల్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

నాగార్జున 100వ మూవీ నుండీ బిగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ , టైటిల్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!
Advertisement

King 100:తండేల్ మూవీతో నాగచైతన్య.. లెనిన్ సినిమాతో అఖిల్ అక్కినేని ఇద్దరూ కూడా మంచి సక్సెస్ లను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు తండ్రి నాగార్జున వంతు వచ్చింది. ఈయన తోటి హీరోలైన వెంకటేష్, చిరంజీవి, వరుసగా సినిమాలు చేస్తూ 100 కోట్లు రాబడుతూ సంచలనం సృష్టిస్తుంటే.. అటు బాలకృష్ణ కూడా భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంటే.. తానేని ఇందుకు అతీతం కాదు అంటూ ఏకంగా తన కెరియర్ లో మైలురాయి మూవీ గా నిలిచిన తన 100వ సినిమాతో రూ.100 కోట్లు అందుకొని రికార్డు సృష్టించాలని చూస్తున్నారు నాగార్జున.

కింగ్ 100 ఫస్ట్ లుక్ , టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ లాక్..

ఈ మేరకు ప్రముఖ తమిళ డైరెక్టర్ రా. కార్తీక్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగా పూర్తి చేసుకున్నప్పటికీ. మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సాధారణంగా స్టార్ హీరోల మైలురాయి చిత్రాలను మొదటి నుంచే ఘనంగా ప్రకటించడం ఆనవాయితీ. కానీ నాగార్జున 100వ సినిమా విషయంలో మాత్రం మేకర్స్ ఈ సాంప్రదాయానికి పూర్తి భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పైగా నాగార్జున కెరియర్లో 100వ మూవీగా రాబోతున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ , ఫస్ట్ లుక్ లేదా అధికారిక ప్రకటన నాగార్జున బర్త్డే రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

అద్భుతమైన వినోదాత్మక చిత్రంగా..

Advertisement

అయితే ఇప్పుడు అనుమానాలకు తెర దించుతూ తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ తన అధికారిక ఎక్స్ సోషల్ మీడియా ఖాతా ద్వారా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ మేరకు ఒక పోస్టర్ని విడుదల చేస్తూ..” ప్రతి కుటుంబం వెనుక ఒక కథ ఉంటుంది. ఈ కుటుంబం వెనుక అంతులేని గందరగోళం ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ , ఎపిక్ స్టూడియోస్ మూవీస్ కలిసి సంయుక్తంగా మీకొక అద్భుతమైన వినోదాత్మక చిత్రాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ గ్లింప్స్ జూలై 17 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఏం జరగబోతుందో చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి “అంటూ ఒక పోస్టు షేర్ చేశారు.

also read:రూ.100 కోట్ల ఆస్తి.. ఊహించని స్టార్డం.. అయినా నోకియా ఫోన్ వాడుతున్న పోసాని.. అసలు కథేంటంటే?

ఆకట్టుకుంటున్న పోస్టర్..

Advertisement

ఇకపోతే తాజాగా వదిలిన లేటెస్ట్ పోస్టర్ లో కోర్టు రూమ్ ఎదుట గాజు గ్లాసులో టూత్ బ్రష్ ని ఉంచిన ఒక పోస్టర్ని పంచుకున్నారు. చూస్తుంటే లీగల్ పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో టబు నెగిటివ్ పాత్ర పోషిస్తున్నారు.

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×