Poyi ra Mawa Song : సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి పాటలు ఎప్పుడూ కీలకపాత్ర వహిస్తాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించిన కుబేర సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకి సంబంధించి మొదటి షో పడిన వెంటనే పాజిటివ్ టాక్ వచ్చేసింది. అతి త్వరగా వంద కోట్లు మార్కెట్లోకి ఈ సినిమా చేరిపోయింది. ముఖ్యంగా ధనుష్ ఈ సినిమాలో నటించిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
అయితే ఈ సినిమాతో శేఖర్ కముల చాలామందిని ఆశ్చర్యపరిచాడు. ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమాను డిజైన్ చేశాడు శేఖర్. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒక విధంగా దేవి సంగీతమే ఈ సినిమాని నిలబెట్టిందని చాలా కామెంట్స్ కూడా వినిపించాయి. కొన్నిచోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అందించాడు దేవిశ్రీప్రసాద్.
పోయిరా మామ ఫుల్ వీడియో
ఈ సినిమాలో పోయి రా మామ పాట ఎంతో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా ఈ పాట విడుదలైనప్పుడు చాలామందికి విపరీతంగా నచ్చింది. అయితే సినిమాలో చూసినప్పుడు మాత్రం ఈ పాట విపరీతంగా ఆడియన్స్ను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈ పాట వచ్చే ప్లేస్మెంట్ గూస్ బంప్స్ అని చెప్పాలి. ఎవరు ఊహించని టైంలో సినిమాలో ఈ పాట వినిపిస్తుంది. ఆడియన్స్ కి ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇచ్చింది. అయితే ఈ పాట ఎప్పుడు విడుదలవుతుందని చాలామంది ఎదురు చూశారు. మొత్తానికి ఈ వీడియో సాంగ్ ను అధికారికంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక యూట్యూబ్ లో కూడా ఈ పాటకి మంచి రెస్పాన్స్ మొదలైంది. ధనుష్ ఫ్యాన్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ సినిమా కూడా త్వరలో ఓటిటిలో విడుదల కానుంది.
శేఖర్ కెరియర్ కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్
ఇప్పటివరకు శేఖర్ కమ్ముల స్టార్ హీరోలతో పని చేసిన దాఖలాలు లేవు. కానీ మొదటిసారి ధనుష్ వంటి హీరోతో పని చేయటంతో పాటు అద్భుతమైన సక్సెస్ అందించాడు. అయితే ఈ సినిమా విడుదలైన వెంటనే తెలుగు హీరోలు ఎవరు ఇలా చేయలేరు అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. ఆ కామెంట్స్ ని ఒప్పుకోలేము. కానీ ధనుష్ మాత్రం ఈ సినిమాలో బాగా చేశాడు. శేఖర్ కమ్ముల ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కేసాడు. పెద్ద హీరోని కూడా డీల్ చేయగలుగుతాడు అని చాలామందికి ఒక నమ్మకాన్ని ఇచ్చాడు. ఇక లీడర్ 2 సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు శేఖర్ కొన్ని ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. నెక్స్ట్ ఎటువంటి ప్రాజెక్ట్ తో ప్రేక్షకులు ముందుకు వస్తాడు అని క్యూరియాసిటీ ఇప్పటికే చాలామందికి మొదలైపోయింది.