Kerala Schools: క్లాస్ రూముల విషయంలో ట్రెండ్ మారుతోందా? దాదాపు 100 ఏళ్లపాటు సాగిన బ్యాక్ బెంచ్ కాన్సెప్ట్‌కు ఫుట్‌స్టాప్ పడుతోందా? ఒకటో తరగతి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఇదే విధానం కొనసాగుతోంది. ఇప్పుడు దానికి బ్రేక్ పడనుందా? ఇకపై మొద్దుబాబులకు నిద్ర వీడుతుందా? ఓ సినిమాలో వచ్చిన కాన్సెప్ట్ మాదిరిగా కేరళ పాఠశాలలో తరగతి గదులు రెడీ అవుతున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ తరగతి గదుల కాన్సెప్ట్ ఏంటి? ఓసారి లుక్కేద్దాం.
దేశంలో అక్షరాస్యత రేటులో టాప్‌లో ఉంటుంది కేరళ. అక్కడ చేపట్టిన ఎడ్యుకేషన్ విధానాలు చాలా రాష్ట్రాలు ఫాలో అయ్యాయి. తాజాగా కేరళ మరో గొప్ప మార్పుకు నాంది పలికింది. శతాబ్దాలుగా విద్యార్ధుల మనసుల్లో పాతుకు పోయిన ‘థియేటర్’ ఆలోచనను మార్చే పనిలో పడింది. ఇటీవల మలయాళంలో ఓ సినిమా విడుదలైంది.
ఆ సినిమాని ఫాలో అవుతున్నాయి కేరళలోని చాలా పాఠశాలలు. అసలు విషాయానికి వచ్చేద్దాం. సాధారణంగా తరగతి గదులు అనేసరికి ముందు టీచర్, గురువుకు ఎదురుగా విద్యార్థులు కనిపిస్తారు. దీనివల్ల ముందు వరుసలో కూర్చొన్న విద్యార్ధులకు పాఠాలు బాగా అర్థమవుతాయని చెబుతారు. వెనుక కూర్చొన్నవాళ్లు మొద్దుబ్బాయి.. నిద్రపోతుంటారని అంటారు.
ఆ విధంగా వారిని ఉపాధ్యాయులు మందలించిన సందర్భాలు లేకపోలేదు. టీచర్ చెప్పే పాఠంపై మొదటి బెంచ్ విద్యార్థుల్లో ఉండే ఏకాగ్రత చివరి బెంచీకి వచ్చేసరికి పూర్తిగా తగ్గిపోతోంది. అందుకే వారిని బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని అంటుంటారు. మలయాళం మూవీ ‘బ్యాక్ బెంచర్స్’లో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది.
ALSO READ: దమ్ముంటే అంబానీపై దాడి చేయండి.. భాషా వివాదంపై బీజేపీ ఎంపీ కామెంట్స్
అందులో తరగతి గదుల్లో విద్యార్థులు కూర్చొనే టేబుల్స్ ‘వి లేదా యు’ ఆకారంలో అమర్చారు. దీనివల్ల ప్రతి విద్యార్దీ టీచర్ ముందే ఉన్నట్లు కనిపిస్తోంది. ఉపాధ్యాయులు చెప్పేది అర్థమవుతుంది, వినిపిస్తోంది కూడా. ఈ కాన్సెప్ట్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనివల్ల విద్యార్థులు నిద్రపోయే ఛాన్స్ ఉండదు. అనుక్షణం వింటూనే ఉండాలి.
ఆ సినిమా స్పూర్తితో ప్రస్తుతం కేరళలో చాలా పాఠశాలలు దీన్ని ఫాలో కావాలని డిసైడ్ అయ్యాయి. కేరళ అంతటా ఈ మార్పు క్రమంగా కనిపిస్తోంది. పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ‘వి లేదంటే యూ’ ఆకారంలో టేబుల్స్ వేసి విద్యార్ధులను కూర్చుబెడుతున్నారు. అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే గదులు చాలవని అంటున్నారు. అప్పుడు పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్న. మొత్తానికి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆ పద్దతి వచ్చినా ఆశ్చర్యం పోనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో నాయకులు బ్రిటీషర్లు కాలంలోని చట్టాలు, ప్రదేశాల పేర్లు మార్చుతున్నారు. పనిలో పనిగా తరగతి గదుల్లో పాత పద్దతిని మార్చినా మార్చవచ్చు.