Indian Man: విమానం వీరంగం సృష్టించాడు అమెరికాలో ఓ భారతీయడు. తన పర్సనల్ సమస్యల నేపథ్యంలో విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. చివరకు విమానంలో తోటి ప్రయాణికులపై దాడి చేశాడు. చికాగో నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో విమానాన్ని అత్యవసరంగా బోస్టన్‌కు మళ్లించారు. చివరకు నిందితుడు ప్రణీత్ కుమార్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు.
విమానంలో భారతీయుడు వీరంగం
అసలు ఏం జరిగింది, ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. 28 ఏళ్ల ఉసిరిపల్లి ప్రణీత్ కుమార్ అనే భారతీయ విద్యార్థి విమానంలో ట్రావెల్ చేస్తున్నాడు. లుఫ్తానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానం చికాగో నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తోంది. ఈ విమానంలో ప్రణీత్‌కుమార్ ప్రయాణం చేస్తున్నాడు. భోజనం సరఫరా చేస్తున్న సమయంలో విచక్షణా రహితంగా ప్రవర్తించాడు.
అతడి చేతిలో ఉన్న మెటల్ ఫోర్క్‌తో 17 ఏళ్ల వయస్సు గల ఇద్దరు బాలురుపై దాడి చేశాడు. ఆ తర్వాత ఫోర్క్‌తో భుజంపై, తల వెనుక భాగంలో పొడిచాడు. చివరకు ప్రశ్నించిన ఓ మహిళను చెంప దెబ్బ కొట్టాడు. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత విమాన సిబ్బందిపై దాడికి యత్నించబోయాడు.
ఇద్దరు యువకులపై దాడి, ఆపై పొడిచి
పరిస్థితి గమనించిన విమాన సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో విమానాన్ని అత్యవసరంగా బోస్టన్‌కు మళ్లించారు. అక్కడ నిందితుడి ప్రణీత్‌కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చాడు ప్రణీత్ కుమార్. అతడు చట్టబద్ధమైన వీసా స్టేటస్‌ను కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బైబిల్ స్టడీస్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో చేరినట్లు సమాచారం.
చికాగోలోని మూడీ బైబిల్ ఇన్‌స్టిట్యూట్‌లో స్టూడెంట్‌గా ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అమెరికాలో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదకరమైన ఆయుధంతో దాడి చేసినందుకు ఉసిరిపల్లిపై తీవ్రమైన అభియోగం మోపబడ్డాయి.
ALSO READ: మంటల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు.. ముగ్గురు మృతి
విమాన సిబ్బంది ఉసిరిపల్లిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతడు తన వేళ్లతో తుపాకీ ఆకారాన్ని తయారు చేసి, దానిని నోటిలో పెట్టుకుని కాల్చుకునే టట్లుగా అభినయించాడని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. నేరం రుజువైతే ప్రతీణ్ కుమార్‌కు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2,50,000 డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బోస్టన్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.
🚨#FBI Boston has charged Praneeth Kumar Usiripalli, an Indian national, with allegedly stabbing two minor victims with a metal fork while on board a Lufthansa flight from Chicago to Germany. Learn more: https://t.co/PRVulpkuaQ pic.twitter.com/VDkyAqM0x1
— FBI Boston (@FBIBoston) October 28, 2025