Bahubali The Epic : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ఆయన కెరియర్కు టర్నింగ్ పాయింట్ అయిన సినిమా అంటే టక్కున బాహుబలి పేరే వినిపిస్తుంది. ఈ మూవీ రెండు పార్టులు గా రి లీజ్ అయింది.. ఒకదానిని మించి మరొకటి రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు జనాలనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి సినీఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పాకింది ఈ సినిమాతోనే. ఈ సినిమా మరోసారి రిలీస్ కాబోతున్న విషయం తెలిసిందే.. బాహుబలి ది ఎపిక్ పేరుతో మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ మళ్లీ థియేటర్లలోకి రాబోతున్నడంతో చాలామంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఈ మూవీ నుంచి అప్డేట్స్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. ప్రస్తుతం ఆ ట్రైలరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఒక రోజు ముందే, అంటే అక్టోబర్ 30న ప్రీమియర్ షోలు వేస్తున్నారు.. ఈ సినిమాను మళ్ళీ థియేటర్లలో చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తుంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో అందరినీ చూపించారు కానీ తమన్న సీన్లు మాత్రం చాలా వరకు కట్ చేశారని తెలుస్తుంది. ప్రభాస్ తమన్నా తో పరిచయం సీన్ నుంచి అమరేంద్ర బాహుబలి అని తెలుసుకున్న సీన్ వరకు అన్ని ఆకట్టుకున్నాయి. అనుష్క ట్రైలర్ కనిపిస్తుంది కానీ తమన్నా మాత్రం ఎక్కువసార్లు కనిపించలేదు… మొత్తానికి ఈ మూవీ మరోసారి బ్లాక్ బస్టర్ హీట్ అయ్యే అవకాశం ఉందని ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
Also Read :డాక్టర్ బాబు మాములోడేమి కాదు.. అమ్మ దొంగ నువ్వు మొదలెట్టేశావా..?
ఇక దీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2 లను కలిపి ఓకే సినిమాగా తీసుకురాబోతున్నారు. ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. వరల్డ్ సినిమాలో ఇదో సరికొత్త ప్రయోగం. ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రన్ టైం వివరాలను ఇటీవలే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. రెండు సినిమాలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావడంలో కొన్ని సీన్లను కట్ చేసినట్టు తెలుస్తుంది. అందులో ఎక్కువగా తమన్న సీన్లను తీసేసినట్లు ఓ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ – తమన్నాలపై తీసిన పచ్చబొట్టేసిన పాట కూడా ఉండకపోవచ్చని అంటున్నారు. అలానే మనోహరి అనే స్పెషల్ సాంగ్ డిలీట్ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. పచ్చబొట్టేసిన సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి పాటని ఎందుకు తీసేసావు రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమా అంటే మరోసారి మ్యాజిక్ రిపీట్ అవ్వాల్సిందే. ఇక 3 గంటల 44 నిమిషాల బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి..