Telugu Titans: ప్రో కబడ్డీ లీగ్ {PKL} 2025లో తెలుగు టైటాన్స్ తమ జోరును కొనసాగిస్తుంది. మంగళవారం రోజు ఢిల్లీ వేదికగా పాట్నా పైరేట్స్ తో జరిగిన ఎలిమినేటర్ – 3 మ్యాచ్ లో 46 – 39 తేడాతో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ప్రతిసారి నిరాశ మిగిల్చే తెలుగు టైటాన్స్.. ఈ ఏడాది దూసుకుపోతోంది. ఎలిమినేటర్ – 3 మ్యాచ్ లో విజయంతో తెలుగు టైటాన్స్ తమ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ.. సీజన్ – 4 తర్వాత తొలిసారి ప్లే ఆఫ్స్ లో స్థానం దక్కించుకుంది. దీంతో తెలుగు టైటాన్స్ జట్టు ట్రోఫీని ముద్దాడేందుకు మరో రెండు విజయాల దూరంలో నిలిచింది. తెలుగు టైటాన్స్ స్టార్ ఆటగాడు భరత్ విజృంభనతో పాట్నా ఆత్మరక్షణలో పడిపోయింది.
భరత్ తో పాటు తెలుగు టైటాన్స్ కెప్టెన్ మాలిక్ 5, డిఫెండర్లు అజిత్, శుభమ్ రాణించారు. ఆల్ రౌండర్ భరత్ హుడా ఒక్కడే 23 పాయింట్లతో చెలరేగి టైటాన్స్ జట్టును గెలిపించడంతోపాటు ఈ సీజన్ లో 200 రైడ్ పాయింట్ల మైలురాయిని చేరాడు. భరత్ సాధించిన 23 పాయింట్లలో 17 టచ్ పాయింట్లు, 6 బోనస్ పాయింట్లు ఉన్నాయి. ఇక పాట్నా పైరేట్స్ ఈ సీజన్ లో తక్కువ పాయింట్లతో కింద ఉన్నప్పటికీ.. అద్భుత రీ ఎంట్రీ ఇచ్చి ఐదు వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ కి చేరుకున్నారు. కానీ తెలుగు టైటాన్స్ చేతిలో ఓడిపోవడంతో వారి 8 మ్యాచ్ ల విజయ పరంపరకు ముగింపు పలకాల్చి వచ్చింది. పాట్నా రైడర్స్ లో అయాన్ మినహా మిగతా వారందరూ విఫలమయ్యారు. బుధవారం జరగనున్న క్వాలిఫైయర్ – 2 లో పుణేరి పల్టన్ తో తెలుగు టైటాన్స్ తలపడబోతోంది.
ఎలిమినేటర్ – 3 మ్యాచ్ లో పాట్నా పై గెలిచి తొలిసారి సెమీస్ కి చేరింది తెలుగు టైటాన్స్. దీంతో తెలుగు టైటాన్స్ కోచ్ క్రిషన్ హూడా ఎమోషనల్ అయ్యారు. “9 సీజన్ల తర్వాత తెలుగు టైటాన్స్ ప్లే ఆప్స్ ఆడుతుంది. తొలిసారి సెమీస్ చేరాము. దీన్ని ఎవరూ ఊహించలేదు. తెలుగు టైటాన్స్ అంటే వస్తుంది, వెళుతుంది అనుకుంటున్నారు. కానీ మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని సెమీస్ చూస్తారు”. అని తెలిపారు కోచ్ క్రిషన్.
ఎలిమినేటర్ – 3 మ్యాచ్ లో విజయంతో తెలుగు టైటాన్స్ అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో తెలుగు టైటాన్స్ మేము ప్రో కబడ్డీని ఏలడానికి వచ్చాం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓ అభిమాని సూపర్ స్టార్ లు లేకుండా క్వాలిఫైయర్ – 2 లోకి ప్రవేశించాము అని, హైల్ భరత్ హుడా, విజయ్ అండ్ కో అంటూ పోస్ట్ చేశాడు.
ఇక క్వాలిఫైయర్ – 2 లో తెలుగు టైటాన్స్ పుణేరి పల్టాన్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 29 బుధవారం రోజు జరగనుంది. ఈ మ్యాచ్ విజేత అక్టోబర్ 31న జరిగే ఫైనల్ లో దబాంగ్ ఢిల్లీని ఎదుర్కొంటుంది. పదిసార్లు ఛాంపియన్లు అయిన పుణేరి పల్టాన్ ఈ సీజన్ లో నిరంతరంగా బలంగా ఆడుతూ లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. అందువల్ల తెలుగు టైటాన్స్ కి ఇది పెద్ద సవాలు అని చెప్పొచ్చు.
बहुत बहुत बधाई, कोच साहब! ❤
You know it’s special for #TeluguTitans when even one of the toughest in the sport gets emotional! 💛
Next on #ProKabaddi 👉 Qualifier 2 | Puneri Paltan 🆚 Telugu Titans | Wed, 29th Oct, 7:30 PM pic.twitter.com/oTYHLxz3vU
— Star Sports (@StarSportsIndia) October 28, 2025