Telugu Titans : ప్రో కబడ్డీ 2025 టోర్నమెంటులో (Pro Kabaddi League ) తెలుగు టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. ప్రో కబడ్డీ లీగ్ 2025 సీజన్ లో క్వాలిఫైయర్ టు స్టేజ్ కు తెలుగు టైటాన్స్ ( Telugu Titans ) చేరుకుంది. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న తెలుగు టైటాన్స్… టైటిల్ గెలిచేందుకు ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఈ టోర్నమెంట్ లో నిన్న పాట్నా పైరేట్స్ జట్టును ( Patna Pirates) చిత్తు చేసి, క్వాలిఫైయర్ 2 కు దూసుకు వెళ్ళింది తెలుగు టైటాన్స్. ఇక ఇవాళ క్వాలిఫైయర్ 2 లో పుణేరి పల్టాన్ (Puneri Paltan) జట్టుతో అమితుమీ తేల్చుకోనుంది తెలుగు టైటాన్స్.
ఇందులో ఒకవేళ తెలుగు టైటాన్స్ విజయం సాధిస్తే శుక్రవారం రోజున దబాంగ్ ఢిల్లీ కేసి ( Dabang Delhi K.C. )తో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ ఎలాగైనా విజయం సాధిస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరహాలోనే తెలుగు టైటాన్స్ కూడా చాలా సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League Tournament ) 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే గడిచిన 17 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎక్కడ టైటిల్ గెలవలేదు. కానీ మొన్న 18వ సీజన్ లో మాత్రం అద్భుతంగా విజయం సాధించి టైటిల్ ఎగురేసుకు వెళ్లింది రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. అలాగే ఫైనల్ దాకా వెళ్లి దక్షిణాఫ్రికా పదే పదే చాలా ఐసీసీ టోర్నమెంట్లలో ఓడిపోయింది. కానీ మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో మాత్రం అద్భుతంగా గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో బెంగళూరు అలాగే దక్షిణాఫ్రికా తరహాలోనే తెలుగు టైటాన్స్ విజయం సాధిస్తుందని అందరూ అభిమానులు అంచన వేస్తున్నారు.
Also Read: Indian Team: ఎముకలు కొరికే చలిలో టీమిండియా ప్రాక్టీస్.. చేతులు పగిలిపోతున్నాయి.. వీడియో వైరల్