Andesri Cremation: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం పూర్తి అయ్యాయి. ఘట్‌కేసర్‌లో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు, మిగతా పార్టీల ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు.
ఘట్‌కేసర్‌లో కవి అందెశ్రీ అంత్యక్రియలు
కవి అందెశ్రీ పాడెను సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా మోశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. అంతకుముందు లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి ఘట్‌కేసర్‌కు ఆయన అంతిమయాత్ర సాగింది. తార్నాక, ఉప్పల్, ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ మీదుగా సాగింది.
ఆ సమయంలో వేలాది మంది అందులో పాల్గొన్నారు. ప్రజా సంఘాల నేతల చివరిసారిగా తమ పాటలతో వీడ్కోలు పలికారు. అంతిమ సంస్కారాలకు ముందు అందెశ్రీ కుటుంసభ్యులకు సీఎం రేవంత్‌రెడ్డి ఓదార్చారు. అంతిమ సంస్కారాలకు ముందు అందరూ రెండు నిమిషాల సేపు మౌనం పాటించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య.
పాడి మోసిన సీఎం రేవంత్‌రెడ్డి
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన పోషించిన పాత్ర మరువలేనిదని అన్నారు. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతోపాటు వ్యక్తిగతంగా తనకు తీరని లోటుగా చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనను కలిసి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మీ పాత్ర ఉండాలని కోరానని గుర్తు చేశారు.
ALSO READ: జూబ్లీహిల్స్ పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ-రాజకీయ ప్రముఖులు
గద్దర్‌తో పాటు అందెశ్రీ కూడా ప్రజల్లో స్పూర్తి నింపారని వివరించారు. ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాదు ఆయన పేరుతో ఒక స్మృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఆయన పాటల సంకలనం “నిప్పుల వాగు” ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా.. తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్‌గా ఉపయోగపడుతుందన్నారు. వారికి పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలన్నారు. రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు ఆయన్ని పద్మశ్రీ తో గౌరవించుకునేందుకు కృషి చేద్దామన్నారు.
అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి
ఘట్‌కేసర్‌లో అందెశ్రీకి అంతిమ సంస్కారాలు pic.twitter.com/MYUYqdh4lM
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025