Shukracharyudu in Mahakali : ప్రశాంత్ వర్మ (Prashanth Varma) సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే హనుమాన్ సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది. దీంతో ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వరుస ప్రాజెక్టులు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా రాబోతున్న మూడవ చిత్రం మహాకాళి.. నిజానికి రెండవ చిత్రం జై హనుమాన్ అంటూ ప్రకటించారు కానీ ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అప్డేట్ లేదు. కానీ మహాకాళి సినిమా మాత్రం ఫిమేల్ సూపర్ హీరో చిత్రంగా రాబోతోంది. దీనికి ప్రశాంత్ వర్మ కథ అందిస్తూ ఉండగా.. పూజఅపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ని పంచుకుంది చిత్ర బృందం. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshay Khanna) శుక్రాచార్యుడిగా నటిస్తున్నట్లు తెలిపారు.. “దేవతల నీడలో కాంతివంతమైన తిరుగుబాటు జ్వాలగా ఎదిగిన శుక్రాచార్యుడు” అంటూ ఒక పోస్టర్ ను కూడా పంచుకోవడం జరిగింది. ఈ పోస్టర్లో చాలా పవర్ఫుల్ శక్తులు కలిగిన శుక్రాచార్యుడి గెటప్ లో అక్షయ్ ఖన్నా చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.
శుక్రాచార్యుడు గెటప్ లో అక్షయ్ ఖన్నా..
ఇకపోతే శుక్రాచార్యుడు గెటప్ రిలీజ్ చేయడంతో పురాణాలలో శుక్రాచార్యుడి పాత్ర ఎటువంటిది అని తెలుసుకోవడానికి ఇప్పుడు అభిమానులు తెగ గూగుల్ సెర్చ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఎవరీ శుక్రాచార్యుడు.. ఆయన పాత్ర ఏంటి? పురాణాలు ఏం చెబుతున్నాయి ? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
రాక్షసులకు గురువుగా ఎందుకు మారారు?
పురాణాలలో ఎంతోమంది చెప్పుకోదగ్గ ఋషులు ఉండగా అందులో బృహస్పతి దేవతలకు గురువైతే.. శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు. బృహస్పతితో సమాన జ్ఞానం కలిగిన శుక్రాచార్యుడు దేవతలకు గురువు కావాల్సింది కానీ దేవతలు బృహస్పతిని గురువుగా ఎంచుకున్నారు. అయితే ఒకసారి విష్ణువు ఒక రాక్షసుడిని వేటాడుతూ వచ్చి ఆశ్రయం ఇచ్చిన శుక్రాచార్యుడి తల్లిని చంపుతాడు. ఆ పగతోనే శుక్రాచార్యుడు రాక్షసులకు గురువుగా మారిపోయారు.
ఎవరీ శుక్రాచార్యుడు?
శుక్రాచార్యుడు బ్రహ్మ దేవుడికి మానస పుత్రుడైన బ్రుగుమహర్షి , ఉశనల దంపతుల కుమారుడు. వేద విద్యను అభ్యసించడానికి అంగీరస మహర్షి దగ్గరకు వెళ్తే.. ఆయన తన కుమారుడైన బృహస్పతి వైపు పక్షవాతం చూపిస్తున్నాడని కలత చెంది.. గౌతమ మహర్షి దగ్గరకు వెళ్లి శిక్షణ తీసుకుంటాడు. శివుని కోసం తపస్సు చేసి సంజీవని మంత్రం సంపాదించిన శుక్రాచార్యుడు .. ప్రియవ్రతుని కుమార్తె అయిన ఉర్జస్వతిని వివాహం చేసుకోగా, నలుగురు కుమారులు, ఒక కుమార్తెకు జన్మనిచ్చారు.
గురువు పైనే కోపం పెంచుకున్న శిష్యులు.. కారణం?
ఇకపోతే శుక్రాచార్యుడు తనకు తెలిసిన సంజీవని మంత్రం ద్వారా మృతులైన రాక్షసులను బ్రతికిస్తూ.. దేవతల మీద విజయం సాధించేలా చేస్తూ ఉంటాడు. అందుకే శుక్రుడి దగ్గర ఆ మృత సంజీవని విద్యను నేర్చుకొని రమ్మని దేవతలు బృహస్పతి కొడుకు అయిన కచుడనే వ్యక్తిని పంపిస్తారు. అయితే అతడు శుక్రుడి దగ్గర శిష్యుడిగా చేరి.. శ్రద్ధగా గురువు సేవ చేస్తూ ఉంటాడు. దాంతో గురువుకి కచుడు అంటే ఇష్టం ఏర్పడుతుంది. అలాగే శుక్రాచార్యుడి కూతురు దేవయాని ఇతడిని ప్రేమిస్తుంది. కచుడిని శుక్రాచార్యుడు అభిమానించడం చూసి అసూయ చెందిన రాక్షసులు కచుడిని చంపాలని ప్రయత్నం చేస్తారు. ప్రతిసారి దేవయాని కాపాడుతూ వస్తుంది. దీంతో ఇలా కాదని రాక్షసులు కచుడిని చంపి ఆ బూడిదను నీళ్లలో కలిపి శుక్రాచార్యుడు చేత తాగిస్తారు. దీంతో దేవయాని తన తండ్రి వద్దకు వచ్చి.. కచుడి జాడ కనుక్కోమని చెప్పగా.. ఆయన యోగ దృష్టితో అంతా గ్రహించి అతడిని మృత సంజీవని విద్యతో బ్రతికించాడు. కానీ కచుడు శుక్రాచార్యుడు కడుపులోనే ఉండిపోయాడు. అప్పుడు శుక్రాచార్యుడు దేవయాని చెప్పిన మేరకు కచుడికి మృత సంజీవని విద్యను నేర్పించి.. తన కడుపు చీల్చుకొని బయటకు వచ్చి ఆ తర్వాత మృత సంజీవని విద్యా ప్రభావంతో తనను బ్రతికించమని కచుడికి చెబుతాడు. శుక్రాచార్యుడు చెప్పినట్లుగానే బయటకు వచ్చి మళ్ళీ శుక్రాచార్యుడిని బ్రతికిస్తాడు కచుడు.
శుక్రాచార్యుడు కూతుర్నే శపించిన కచుడు..
వచ్చిన పని పూర్తవడంతో వెళ్లిపోవడానికి కచుడు శుక్రాచార్యుడి దగ్గర అనుమతి తీసుకుంటుండగా.. దేవయానికి ఈ విషయం తెలుస్తుంది. వెంటనే కచుడి దగ్గరకు వెళ్లి దేవయాని వివాహం చేసుకోమని అడుగుతుంది. గురువు కుమార్తె నాకు సోదరి సమానురాలు. కాబట్టి నేను వివాహం చేసుకోలేని చెబుతాడు. దీంతో కోపంతో ఊగిపోయిన దేవయాని నువ్వు నేర్చుకున్న మృత సంజీవని విద్య నీకు పనికిరాకుండా పోతుంది అంటూ శపిస్తుంది. నాకు పనికి రాకపోయినా నేను వేరొకరికి నేర్పుతాను అది చాలు.. అంటూ కచుడు కూడా నీకు బ్రాహ్మణుడితో వివాహం జరగదు అంటూ శపిస్తారు. ఆ తర్వాత కచుడు దేవతలకు తన మృత సంజీవని విద్యను నేర్పుతారు.
also read:Nani Sujeeth : దసరాకు నాని – సుజీత్ మూవీ.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్
In the shadows of gods,
rose the brightest flame of rebellion 🔥Presenting The Enigmatic #AkshayeKhanna as the eternal 'Asuraguru SHUKRACHARYA' from #Mahakali 🔱❤️🔥@PujaKolluru @RKDStudios #RKDuggal #RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/mclj39Q8z9
— Prasanth Varma (@PrasanthVarma) September 30, 2025