Prabhas spirit: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్(Prabhs) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈయన అభిమానులు ప్రభాస్ ను నేరుగా చూస్తే చాలు అనుకునేవారు ఆయనతో కలిసి ఒక సెల్ఫీ దిగాలనుకునేవారు చాలామంది ఉంటారు అయితే ఇలాంటి అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ ని కలిసి సెల్ఫీ తీసుకోవడమే కాదు ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని కూడా చిత్ర బృందం కల్పించారు.
ప్రభాస్ తో నటించే ఛాన్స్?
ప్రభాస్ తో కలిసి నటించాలనుకునే అభిమానులు ఎవరైనా ఉంటే వెంటనే ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి(Sandeep Reddy) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్పిరిట్ (Spirit)సినిమాలో నటించే ఛాన్స్ సంపాదించుకోవచ్చు. మరి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కోసం ఏం చేయాలనే విషయానికి వస్తే.. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో ఆర్టిస్టుల కోసం చిత్రబృందం ఆడిషన్స్ నిర్వహించబోతున్నారు అయితే ఇందులో 13 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు.
డిజిటల్ ఆడిషన్స్ నిర్వహించబోతున్న స్పిరిట్ టీమ్…
ఇలా ఎవరికైతే ఆసక్తి ఉంటుందో అలాంటివారు డిజిటల్ ఆడిషన్స్ లో పాల్గొనడం కోసం spirit.bhadrakalipictures@gamai.com కి మీ వివరాలను పంపించాలని తెలియజేశారు. ఇలా ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ పేరు, చిరునామా ఇతర వివరాలను చిత్ర బృందం తెలియజేసిన ఈ మెయిల్ ఐడికి పంపిస్తే చాలు అదృష్టం ఉంటే మీరే ప్రభాస్ పక్కన కలిసి నటించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వివరాలను నమోదు చేసుకోండి. ఇక సందీప్ రెడ్డి ప్రభాస్ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్,టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా త్రిప్తి దిమ్రి(Tripti Dimri) నటించబోతున్నారు.
ద్విపాత్రాభినయంలో ప్రభాస్?
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. అయితే ప్రభాస్ అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా షూటింగ్ తో పాటు, హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న పౌజీ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలతో పాటు ఈయన సలార్2, కల్కి 2 వంటి సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమాలు కూడా షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతున్నాయి. ఇక త్వరలోనే ది రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్నట్టు సమాచారం.
Also Read: Saiyaara: ఇదెక్కడి విడ్డూరం సామీ… సినిమా చూస్తూ ఏడవలేదని అరెస్ట్..రూ. 2లక్షల ఫైన్!