Saiyaara: సైయారా(Saiyaara) బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అహాన్ పాండే(Ahaan Panday), అనీత్ పడ్డా(Aneet Padda) హీరో హీరోయిన్లగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల కలెక్షన్లను కూడా వెనక్కినట్టే ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించిందని చెప్పాలి. ఈ సినిమా జులై 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు సుమారు 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది.
గుక్క పట్టి ఏడుస్తున్న ప్రేక్షకులు…
అహాన్ పాండే హీరోగా పరిచయం అవుతూ నటించిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమాతో ఈయన పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా మారుమోగుతుంది. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్లలో గుక్క పట్టి ఏడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా చూస్తూ ఏడవలేదు అంటూ గురుగ్రామ్(Gurugram) కి చెందిన అస్లీ వరుణ్(Asli Varun) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు సినిమా చూసి ఏడవలేదని అరెస్టు చేయడం ఏంటి? అసలేం జరిగింది అనే విషయానికి వస్తే…
రూ.2 లక్షలు ఫైన్…
గురుగ్రామ్ కి చెందిన వరుణ్ అనే కుర్రాడు సైయ్యారా సినిమా చూడటం కోసం థియేటర్ కి వెళ్ళారట అయితే అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ గుక్కపట్టీ ఏడుస్తూ కూర్చున్నారని భార్యాభర్తలు ఒకరి భుజంపై మరొకరు వాలిపోయి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారని వెల్లడించారు. అయితే తను మాత్రం పాప్ కార్న్ తింటూ ఏదో చోట బీమ్ సినిమా చూసినట్టు ఆ సినిమాని ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో ఈయనని పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఫైన్ వేశారు అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇతనిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తూ అసలు ఎందుకు ఈ సినిమా చూసి ఏడవలేదని ప్రశ్నించగా, ఆ కుర్రాడు నాకు ఇప్పటివరకు గర్ల్ ఫ్రెండ్ లేదు.. అందుకే బ్రేకప్ అంటే ఎలా ఉంటుందో తెలియదని సమాధానం చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే సయారా 2 విడుదల సమయానికి నీకు మేము ఒక గర్ల్ ఫ్రెండ్ ను తెచ్చి పెడతామని అప్పటిలోపు నువ్వు బ్రేకప్ చెప్పుకొని ఈ సినిమా చూస్తూ ఏడవాలని సూచించినట్టు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొందరు సినిమా చూస్తూ ఏడవక పోతే అరెస్టులు చేస్తారా అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఇది ఫన్నీగా చేసిన పోస్ట్ అని, ఇది నిజం కాదు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అయితే నిజంగానే ఇలాంటి ఘటన జరగలేదు, కేవలం సోషల్ మీడియా పాపులారిటీ కోసమే ఇలాంటి పోస్ట్ చేశారని తెలుస్తోంది.
Also Read: T.G.Vishwa Prasad: అకీరా కోసం వీరమల్లుకు సాయం.. పెద్ద ప్లాన్ వేసిన విశ్వ ప్రసాద్?