E-Paper
Advertisement

ప్రభాస్ ‘స్పిరిట్’ బిజినెస్ ధమాకా.. రెండు రాష్ట్రాల హక్కులు మైత్రీ సొంతం!

ప్రభాస్ ‘స్పిరిట్’ బిజినెస్ ధమాకా.. రెండు రాష్ట్రాల హక్కులు మైత్రీ సొంతం!
Advertisement

Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ‘కల్కి 2898 AD’ వంటి భారీ విజయం తర్వాత, ప్రభాస్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో, ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది.

Read also-బిగ్ బాస్‌లో ఇమ్మానియేల్ కి ఫైమా సపోర్ట్ చేయకపోవడానకి కారణం ఇదే..

మైత్రీ మూవీ మేకర్స్ చేతికి ‘స్పిరిట్’ హక్కులు

Advertisement

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా పంపిణీ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఏరియాలతో పాటు, నైజాం (తెలంగాణ) హక్కుల విషయంలో మైత్రీ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ప్రభాస్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధం వారి పంపిణీ నెట్‌వర్క్ దృష్ట్యా, ఈ డీల్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లోని కీలక ప్రాంతాల్లో కూడా ఈ సినిమాను మైత్రీ సంస్థే విడుదల చేయబోతోందని ట్రేడ్ వర్గాల టాక్.

భారీ అంచనాలు..

‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ మొదటిసారి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సందీప్ వంగా మార్కు ఇంటెన్సిటీ, ప్రభాస్ కటౌట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. అందుకే, ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను దక్కించుకోవడం వల్ల బిజినెస్ పరంగా ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలం చేకూరింది. మార్చి 2027లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Advertisement

Read also-ఫైమా తన ఫేవరేట్ హీరోతో ఏం చేయాలనుకుందో తెలిస్తే షాక్ అవుతారు.. అస్సలు ఊహించరు..

సినిమా విశేషాలు

ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదలైన ‘రాజాసాబ్’పై మిశ్రమ స్పందన రావడంతో సందీప్ రెడ్డి వంగ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఒక పోలీస్ స్టోరీని సందీప్ వంగా ఏ రేంజ్‌లో చూపిస్తారో అన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద సంస్థ పంపిణీ బాధ్యతలు చేపట్టడంతో, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి, ‘స్పిరిట్’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఒక భారీ వెంచర్ అని చెప్పవచ్చు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×