E-Paper
Advertisement

నెలకు రూ. కోటి సంపాదిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ యువతి.. వైరల్ న్యూస్ లో వాస్తవం ఎంత?

నెలకు రూ. కోటి సంపాదిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ యువతి..  వైరల్ న్యూస్ లో వాస్తవం ఎంత?
Advertisement

Influencer Ashwani Income Truth: ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. కేరళకు చెందిన అశ్విని అనే యువతి ఇన్‌ స్టాగ్రామ్ ద్వారా నెలకు రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తోందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, ఆమె ఇన్‌ స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా ఈ ఆదాయం పొందుతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  అయితే, ఈ వార్త నిజమా? కాదా? అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది.

నెలకు రూ. కోటికి పైగా సంపాదన

వైరల్ అవుతున్న వివరాల ప్రకారం, అశ్వినికి సుమారు 25,900 మంది సబ్‌ స్క్రైబర్లు ఉన్నారు. ప్రతి సబ్‌ స్క్రిప్షన్ ధర రూ.399గా ఉంది.  ఈ లెక్కన చూస్తే మొత్తం ఆదాయం సుమారు రూ.1.03 కోట్లు అవుతుంది. పైకి చూసినప్పుడు ఈ లెక్క సరిగానే అనిపించినా, వాస్తవ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో చూపించే సంఖ్యలు పూర్తిగా నిజం కావాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో ఫాలోవర్స్, సబ్‌ స్క్రైబర్ల సంఖ్యలు పెంచి చూపించే అవకాశాలు ఉంటాయి. రెండవది, ప్రతి సబ్‌స్క్రైబర్ నెల నెలా చెల్లింపు కొనసాగిస్తారని అనుకోవడం కష్టం. చాలా మంది ఒకసారి సబ్‌ స్క్రైబ్ చేసి తర్వాత రద్దు చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల లెక్కలు చెప్పినంత స్థిరంగా ఆదాయం రావడం అనేది కచ్చితంగా చెప్పలేం.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కమిషన్

Advertisement

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ ఫారమ్‌లు తమకు సంబంధించిన కమిషన్‌ను తీసుకుంటాయి. అంటే, యూజర్ చెల్లించిన మొత్తం డబ్బు మొత్తం ఇన్‌ ఫ్లుయెన్సర్‌ కు చేరదు. కొంత శాతం ప్లాట్‌ఫారమ్‌కు వెళుతుంది. అలాగే ట్యాక్స్‌ లు, ఇతర ఖర్చులు కూడా తగ్గించాలి. కాబట్టి బయటకు కనిపించే మొత్తం ఆదాయం కంటే చేతికి వచ్చే నికర ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది.

అదే సమయంలో, ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా మంచి ఆదాయం సంపాదించడం అసాధ్యం కాదు. ప్రత్యేకమైన కంటెంట్, మంచి ఫ్యాన్ బేస్ ఉంటే ఇన్‌ఫ్లుయెన్సర్లు లక్షల్లో, కోట్లలో కూడా సంపాదిస్తారు. కానీ అందరూ చెప్పినట్లుగా కచ్చితంగా రూ.1 కోటి వస్తోంది అని నిర్ధారించడం కష్టం. ఈ సమాచారం పూర్తిగా అధికారికంగా ఎక్కడా కన్ఫార్మ్ కాలేదు.

Advertisement

మొత్తం మీద, అశ్విని అనే యువతి మంచి ఆదాయం సంపాదిస్తోందని అనుకోవచ్చు. కానీ, వైరల్ అవుతున్న గణాంకాలు పూర్తిగా నిజమా? కాదా? అన్నది స్పష్టంగా చెప్పలేం. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మేముందు ఒకసారి పరిశీలించడం చాలా అవసరం. ఎందుకంటే చాలాసార్లు ఇవి ఆకర్షణ కోసం, వైరల్ కోసం పెంచి చూపించే అవకాశాలు ఉంటాయి. , 2026లో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత చర్చనీయాంశమైన ఇండియన్ డిజిటల్ క్రియేటర్లలో ఆమె ఒకరిగా నిలిచింది. కేవలం బ్రాండ్ ఎండార్స్‌ మెంట్లపై ఆధారపడకుండా, ఫాలోవర్ల నుంచి నేరుగా డబ్బు సంపాదించడం అశ్వినికి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు.

Read Also: వామ్మో.. ఏకంగా 27వ అంతస్తు నుంచి పాక్కుంటూ దిగిపోయిన 89 ఏళ్ల బామ్మ

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×