BigTV English
Advertisement

The Raja Saab : ఇంకా ఓటీటీ డీల్ కాలేదు… VXF కాలేదు… పైగా 218 కోట్ల తలనొప్పి ?

The Raja Saab : ఇంకా ఓటీటీ డీల్ కాలేదు… VXF కాలేదు… పైగా 218 కోట్ల తలనొప్పి ?

The Raja Saab Release : ఒంటి చేత్తో పదిమందిని మట్టుబెట్టే కటౌట్ మన డార్లింగ్ ప్రభాస్‌ది. అందుకే.. బాహుబలి, సాహో సలార్, కల్కి లాంటి ప్యూర్ యాక్షన్ సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చాయి. అయితే, అలాంటి కటౌట్… ఇప్పుడు భయపడాలి… భయపెట్టాలి. అలాంటి ఆలోచనల నుంచే… మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ది రాజా సాబ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.


ఇప్పటికే ఈ మూవీ చాలా సార్లు వాయిదా వేసుకుంది. నిజానికి ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, అది కాస్త వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 9వ తేదీకి వాయిదా పడింది. సంక్రాంతి బరిలో ప్రభాస్… అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ, ఇప్పుడు ఈ సంక్రాంతి బరిలో నుంచి కూడా ది రాజా సాబ్ తప్పుకుంటుందనే వార్తలు ఇండస్ట్రీలో విరి విరిగా వినిపిస్తున్నాయి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.

ఇంకా ఓటీటీ డీల్ కాలేదు…

ప్రభాస్ సినిమా… అందులోనే ప్రభాస్ ఫస్ట్ టైం నటిస్తున్న హర్రర్ కామెడీ. అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఓటీటీ బిజినెస్ అయినా… థియేట్రికల్ బిజినెస్ అయినా.. కళ్లుముసుకుని క్లోజ్ అయిపోతాయి. కానీ, ది రాజా సాబ్ మూవీ ఇంకా ఓటీటీ డీల్ అవ్వలేదు. దీని వెనక చాలా లీగల్ ఇష్యూలు ఉన్నాయి.


రిలీజ్ అవ్వాలంటే 218 కోట్లు కట్టాలి ?

ఈ మూవీని ముందుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు IVY ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మించింది. మూవీ మొత్తం బడ్జెట్ 400 కోట్లపైనే ఉంది. అందులో IVY ఎంటర్టైన్మెంట్ వాళ్లు దాదాపు 218 కోట్ల వరకు పెట్టరంట. వీరి మధ్య ఇప్పుడు వివాదాలు నడుస్తున్నాయి.

అప్డేట్స్ సరిగ్గా ఇవ్వడం లేదని, VXF వర్క్స్ సరిగ్గా లేకపోవడం అన్నింటి కంటే ముఖ్యంగా మూవీ కోసం పెడుతున్న బడ్జెట్ వివరాలను IVY ఎంటర్టైన్మెంట్ కు పీపుల్స్ మీడియా సరిగ్గా చూపించలేదంట.

హై కోర్టు వరకు వెళ్లిన పంచాయితీ

వీటి అన్నింటి వల్ల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై IVY ఎంటర్టైన్మెంట్ ఢిల్లీ హై కోర్టులో కేసు కూడా పెట్టింది. ది రాజా సాబ్ మూవీ కోసం తాము ఇచ్చిన 218 కోట్లను తిరిగి చెల్లించేలా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హై కోర్టు మెట్లు ఎక్కింది IVY ఎంటర్టైన్మెంట్. అయితే ఈ కేసును ఢిల్లీ హై కోర్టు ఆర్బిట్రేషన్ & కాన్సిలియేషన్ యాక్ట్ సెక్షన్ 8 ప్రకారం ఆర్బిట్రేషన్‌కి రిఫర్ చేసింది. ఈ ఆర్బిట్రేషన్ & కాన్సిలియేషన్ యాక్ట్ సెక్షన్ 8 అంటే… కోర్టు బయట ఈ ఇష్యూను సెటిల్ చేసుకోవాలని అర్థం.

రిలీజ్‌కు రెండు అడ్డంకులు ?

ఇలా ఇన్ని పంచాయితీల మధ్య ది రాజా సాబ్ ఉంది. ఇప్పుడు మూవీ జనవరి 9 నుంచి వాయిదా పడబోతుంది అని చెప్పడానికి రెండు కారణాలు చెబుతున్నారు.

ఒకటి : IVY ఎంటర్టైన్మెంట్ కు ఇవ్వాల్సిన 218 కోట్లను ఇవ్వాలి. అలా ఇస్తేనే ది రాజా సాబ్ మూవీ రిలీజ్‌కు IVY ఎంటర్టైన్మెంట్ క్లియరెన్స్ ఇస్తారు. ఒక వేళ IVY ఎంటర్టైన్మెంట్ వాళ్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇవ్వాల్సిన 218 కోట్లను ఇవ్వకపోతే… సినిమా రిలీజ్‌ను అడ్డుకునే అవకాశం ఉంది.

రెండు : ఎప్పటిలానే… ఈ సినిమా VFX పనుల్లో చాలా వరకు పెండింగ్ ఉన్నాయంట. మొన్నామధ్య ప్రభాస్ కూడా VFX ను చూసి అసంతృప్తికి గురయ్యాడు అనే టాక్ వచ్చింది. దీంతో పాటు ఇటీవల వచ్చిన ట్రైలర్‌లో కూడా పూర్ VFX ను చూశారు.

ఇవి అన్నీ ఫిక్స్ అవ్వాలంటే… చాలా టైం పడుతుంది. కానీ, జనవరి 9 అంటే ఇంకా రెండు నెలలు మాత్రమే టైం ఉంది. ఈ రెండు నెలల టైంలో ఉన్న ఈ సమస్యలన్నీ క్లియర్ చేయడం అంత సులువేమీ కాదు. అందుకే ఈ మూవీ జనవరి 9 నుంచి వాయిదా పడుతుంది అని చాలా గట్టిగా వినిపిస్తుంది.

చూడాలి మరి… ఈ రెండు నెలల్లో ఇవి అన్నీ క్లియర్ చేసి జనవరి 9న రిలీజ్ చేస్తారో… లేదా 2026 సమ్మర్‌కి షిఫ్ట్ అయిపోతారో..

ఫ్యాన్స్ వెయిటింగ్..

ఈ వివాదలు అన్నీ ఇలా ఉంటే…  హర్రర్ కామెడీ మూవీలో డార్లింగ్ ప్రభాస్‌ను ఫస్ట్ టైం చూడటానికి అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు. అన్నీ అనుకూలించి… జనవరి 9న.. సంక్రాంతి బరిలోనే రాజా సాబ్ ఉండాలని అనుకుంటున్నారు.

Related News

Ustaad Bhagat Singh : సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ, మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి?

Anupama Parameswaran : బైసన్ బాగా కలిసి వచ్చింది, వైజయంతి బ్యానర్ లో అనుపమ సినిమా

Naveen Polishetty: సింగర్ గా మారిన నవీన్ పోలిశెట్టి, మామ ఎక్కడ తగ్గట్లేదు

Mari Selvaraj : స్టార్స్ లేకుండానే సూపర్ హిట్స్, ఇది డైరెక్టర్ స్టామినా

Shiva 4k Official Trailer: నాగార్జున శివ మూవీ మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ కానున్న సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ విడుదల చేశారు.

Rowdy Janardhan: విజయ్‌ ‘రౌడీ జనార్థన్‌’ క్రేజీ అప్‌డేట్‌.. సెకండ్‌ షెడ్యూల్‌ మొదలయ్యేది అప్పుడే

Vd14 : విజయ్ దేవరకొండ సినిమాలో భారీ మార్పులు, కథపై క్లారిటీ లేకుండానే గ్రీన్ సిగ్నల్?

Bandla Ganesh: బండ్లన్నకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్..కథల వేటలో బిజీగా!

Big Stories

×