Jayammu Nischayammuraa: జగపతిబాబు (Jagapathi Babu)హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammuraa) కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరవుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు అయితే ఈ వారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈమె నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల అయింది.
ఈ ప్రోమో వీడియోలో భాగంగా రష్మిక చిన్నప్పటి విషయాలు గురించి జగపతిబాబు ప్రశ్నలు అడిగారు అలాగే ఈ కార్యక్రమంలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా దర్శకుడు, సినీ నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జగపతిబాబు రష్మిక తో మాట్లాడుతూ మగ వాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండు అని ఆలోచన చేశారట కదా అంటూ ప్రశ్న వేశారు దీంతో రష్మిక అవునని సమాధానం చెప్పారు. ఒక్కసారి మగ వాళ్లకు పీరియడ్ వస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని, అమ్మాయిలు పడే బాధ ఏంటో అర్థం చేసుకోవాలి అంటే ఒక్కసారి పీరియడ్ రావాలి అంటూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రష్మిక తన కెరియర్ గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి ఏం మాట్లాడారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమంలో భాగంగా జగపతిబాబు కేవలం తన కెరియర్ గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి పరోక్షంగా తన నిశ్చితార్థం గురించి కూడా అడిగారని తెలుస్తోంది. రష్మిక ఇప్పటికే నటుడు విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈమె చేతికి ఉన్న రింగు గురించి జగపతిబాబు అడగడంతో ఆ రింగ్ చాలా స్పెషల్ అని కూడా రష్మిక పరోక్షంగా నిశ్చితార్థం గురించి క్లారిటీ ఇచ్చారు.
కాలేజీ అమ్మాయిగా రష్మిక..
ఇక ది గర్ల్ ఫ్రెండ్ విషయానికి వస్తే.. కాలేజీ అమ్మాయి పాత్రలో రష్మిక కనిపించబోతుందని ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ట్రైలర్ కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. అను ఇమ్మానుయేల్, రష్మిక, దీక్షిత్ శెట్టి వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 7వ తేదీ విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడు నిర్మాతలుగా గీత ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే థామా సినిమా సక్సెస్ లో ఉన్న రష్మిక త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా మరో హిట్ అందుకోబోతున్నారని స్పష్టం అవుతుంది.
Also Read: Kalki -Shambhala: ప్రభాస్ కల్కి సినిమాకు.. ఆది శంభాలకు లింక్