OpenAI అందుబాటులోకి తీసుకొచ్చిన ChatGPT గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒక విషయంగా గురించి చాట భారతం కాకుండా మూడు ముక్కల్లో చెప్పేలా దీనిని రూపొందించారు. అడిగిన విషయానికి ఎంత అవసరమో అంతే స్థాయిలో సమాచారం అందిస్తుంది. ఈ సర్వీసును ఉపయోగించుకునేందుకు OpenAI సంస్థ కొంత ఛార్జ్ చేస్తుంది. అయితే, భారతీయులకు ఓ క్రేజీ ఆఫర్ అందిస్తోంది. ChatGPT Go సబ్ స్క్రిప్షన్ ద్వారా ఉంచితంగా అందించబోతోంది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజం భారతో జరిగిన DevDay ఎక్స్ఛేంజ్ ఈవెంట్ లో భాగంగా ఈ ఆఫర్ ను ప్రకటించింది. ప్లస్ సబ్ స్క్రిప్షన్ కు చౌకైన ప్రత్యామ్నాయంగా కంపెనీ ఆగస్టులో గో ప్లాన్ ను విడుదల చేసింది. ప్లస్ నెలవారీ ఛార్జీ రూ. 1,950గా ఉండగా, గో ప్లాన్ కు కేవలం రూ. 399కే అందిస్తోంది. కానీ, ఇప్పుడు, 12 నెలల పాటు, భారతీయ వినియోగదారులు ఉచితంగా ChatGPT సేవలను అందించబోతోంది. ఈ ప్లాన్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ChatGPT Go ప్లాన్ ఉచిత టైర్, ప్లస్ సబ్ స్క్రిప్షన్ మధ్య ఉంటుంది. ఈ ప్లాన్ భారత్ కోసం ప్రత్యేకంగా విడుదల చేయబడింది. అయినప్పటికీ కంపెనీ దీనిని ఇతర ప్రాంతాలలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఇది తక్కువ ధర లేదంటే బేసిక్ రేంజ్ సబ్ స్క్రిప్షన్ గా ఉంటుంది. కానీ, ఈ టైర్ వీడియో జనరేషన్, కోడెక్స్ ఏజెంట్ కు యాక్సెస్ లాంటి కొత్త ఫీచర్లతో రాదు. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ చాలా మంది వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండే అనేక ప్రయోజనాలతో వస్తుంది. ప్రత్యేకించి ChatGPTని ఎక్కువగా ఉపయోగిస్తుంటే. ChatGPT Go ప్లాన్ ఉచిత టైర్ నుంచి అన్ని ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. మెసేజ్ లు, ఫైల్ అప్ లోడ్ లు, ఇమేజ్ జనరేషన్ కోసం 10 రెట్లు ఎక్కువ పరిమితులను అందిస్తుంది.
OpenAI తాజా ఫ్రాంటియర్ మోడల్, GPT-5కి విస్తరించిన యాక్సెస్‌ను కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ మరింత ఉపయోగపడుతుంది. కొత్త ప్లాన్ పైథాన్, ఇతర డేటా విశ్లేషణ టూల్స్ లో అధిక పరిమితులను అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రాజెక్ట్ లు, టాస్క్ లు, కస్టమ్ GPTలకు యాక్సెస్ అందిస్తుంది, దీని ద్వారా వినియోగదారులు తమ పనిని ఈజీగా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పని పురోగతిని కూడా ఈజీగా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.
⦿ ముందుగా ChatGPTని ఓపెన్ చేసి సబ్ స్క్రిప్షన్ కోరుకునే అకౌంట్ కు సైన్ ఇన్ చేయాలి.
⦿ లాగిన్ అయిన తర్వాత, స్క్రీన్ పై ‘ట్రై గో ఫ్రీ’ అనే పాప్ అప్ కనిపిస్తుంది. దిగువన ఉన్న ట్రై గో బటన్ పై క్లిక్ చేయాలి.
⦿ బటన్ ధరల పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు అన్ని ChatGPT ప్లాన్లను చూడొచ్చు. Go ప్లాన్ రూ. 0 మీద క్లిక్ చేయాలి.
⦿ ఆ తర్వాత పేమెంట్స్ పేజీకి వెళ్తారు. అక్కడ మీరు UPI, క్రెడిట్, డెబిట్ కార్డ్ లు, బ్యాంక్ ట్రాన్స్ ఫర్ ద్వారా రూ. 0 చెల్లింపు చేయమని అడుగుతారు. ఫ్రీ టైమ్ ముగిసిన తర్వాత చెల్లింపులు చేయకుండా ఆపేందుకు ఆటోపేను ఆఫ్ చేయాలి.
⦿ మీ ChatGPT Go ప్లాన్ యాక్టివ్ అవుతుంది.
Read Also: 5000: రూ. 5 వేల లోపు అదిరిపోయే హెడ్ ఫోన్స్.. వెంటనే కొనేయండి!