Prabhas:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్(Prabhas) .. బాహుబలి (Bahubali) సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ముఖ్యంగా వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద చాటుతున్నారు. అంతేకాదు తన సినిమాలతో అరుదైన రికార్డులు క్రియేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ప్రభాస్. అలాంటి ఈయన తాజాగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డును సృష్టించి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఈ సత్తా చాటిన ఏకైక హీరోగా కూడా ప్రభాస్ రికార్డు సృష్టించారు. మరి ప్రభాస్ సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అప్పట్లో అదే రికార్డు..
ముఖ్యంగా ఎన్టీఆర్ (NTR ) ,ఏఎన్నార్(ANR ), చిరంజీవి(Chiranjeevi ), వెంకటేష్ (Venkatesh) వంటి హీరోలు ఇండస్ట్రీలో జెడ్ స్పీడ్ లో కొనసాగుతున్న సమయంలో ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేదాన్ని బట్టి హిట్, ఫ్లాప్ డిసైడ్ చేసేవాళ్ళు.దానిని రికార్డులు అని కూడా చెప్పేవారు. ఇప్పుడు సినిమా విడుదల అవ్వకముందే రికార్డులు మొదలవుతున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా ఇప్పుడు ఒక రికార్డు అని చెప్పాలి. సినిమా విడుదలకు ముందు ట్రైలర్ కి వచ్చిన వ్యూస్, లైక్స్ కూడా రికార్డులే అనే చెప్పవచ్చు. అంతేకాకుండా మొదటి రోజు ఒక సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టిపడింది..
తొలి రోజు 100 కోట్లు రాబట్టిన చిత్రాలు ఇవే..
అందులో భాగంగానే సినిమా మొదటి రోజు వసూళ్లను కచ్చితంగా చూస్తున్నారు. ఆల్ ఇండియాలోనే తొలి రోజు రూ.100 కోట్లు గ్రాస్ చేసిన సినిమాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. మొట్టమొదటిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2’ తొలిరోజే రూ.100 కోట్లు గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. 2017 లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ చిత్రాలలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహూ’ 2019లో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమా కూడా మొదటి రోజు వంద కోట్లు రాబట్టి రికార్డు అందుకుంది. ఇక తర్వాత ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజిఎఫ్ చాప్టర్ 2’ , ‘సలార్’ , ‘ కల్కి’ , ‘ఆది పురుష్’ , ‘దేవర’ , ‘పుష్ప2’ వంటి చిత్రాలు తొలిరోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. ఇక ఈ చిత్రాలలో పుష్ప 2 మాత్రం ఏకంగా మొదటి రోజు రూ.200 కోట్లు రాబట్టింది.
ఆ ఘనత సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్..
ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే.. ఇలా మొదటి రోజు రూ.100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలలో ప్రభాస్ కి సంబంధించి ఐదు చిత్రాలు ఉండడం గమనార్హం. ఆది పురుష్, బాహుబలి 2, సాహో, సలార్ , కల్కి ఇలా మొత్తం ఐదు చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ.100 కోట్లు రాబట్టిన ఐదు చిత్రాలతో ప్రభాస్ సంచలనం సృష్టించారు.. ప్రస్తుతం ప్రభాస్ కి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read: Minu muneer: ప్రముఖ నటి అరెస్ట్.. పదహారేళ్ల బాలికపై అత్యాచారం!