Sangareddy Crime: హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న జిల్లాల్లో సంగారెడ్డి ఒకటి. ఈ జిల్లా పరిశ్రమలు, వ్యవసాయం, రవాణా కారిడార్‌గా పేరుగాంచిన ప్రాంతం. ఇక్కడ నేషనల్ హైవే 65 మీదుగా నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున లారీలు ఎక్కువగా వెళ్తుంటాయి. ఇదే అదునుగా చూసుకుని దోపిడి దొంగలు లారీకు అడ్డంగా వెళ్లి.. దొంగతనానికి పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. లారీ డ్రైవర్ పై దాడి చేసి డబ్బులు దొంగతనం చేసే ఘటనలు ఇటీవల ఎక్కువ అయ్యాయి. తాజాగా నిన్న రాత్రి కొండాపూర్ మండలం, మల్కాపూర్ చింతల్ వద్ద నేషనల్ హైవే 65పై దోపిడి దొంగలు ఓ లారీ డ్రైవర్ ను ఆపి చితకబాది దొంగతనం చేశారు. లారీ డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిన్న సాయంత్రం ఓ వ్యక్తి సిమెంట్ లోడుతో సదాశివపేట వైపు వెళ్తున్నాడు. కొండాపూర్ మండలం మల్కాపూర్ చింతల్ వద్దకు రాగానే దోపిడి దొంగలు లారీ డ్రైవర్ ను ఆపారు. అనంతరం డ్రైవర్ పై ఒక్కసారిగా దాడికి దిగారు. తల్వార్లతో డ్రైవర్ పై దాడి చేసి అతడి వద్ద ఉన్న డబ్బును గుంజుకున్నారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ దోపిడి దొంగల నుంచి తప్పించుకుని వస్తుండగా అదుపు తప్పి లారీ డివైడర్ ఎక్కడంతో ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Bank Jobs: డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. భారీ వేతనం, ఇంకొన్ని గంటలే ఛాన్స్ బ్రో
పోలీసులు రాత్రి లారీ డ్రైవర్ ను ఆస్పత్రిలో చేర్పించారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు దోపిడి దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.