Malayalam actress Arrested: సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ అధికంగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎంతోమంది అమ్మాయిలు ఎన్నో కలలతో హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు.. కానీ తెలిసి తెలియని వయసులో కొంతమంది చేతిలో దారుణంగా మోసపోయి జీవితాలనే కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మరి కొంతమంది ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు అండగా నిలబడడమే కాకుండా స్వలాభం కోసం వారిని వాడుకొని.. ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న మిను మునీర్ (Minu muneer) కూడా అలాంటి జాబితాలోకి చేరిపోయింది. తాజాగా ఈమె చేసిన పని ఈమె మెడకు చుట్టుకుందని చెప్పవచ్చు.
మాయ మాటలు చెప్పి బాలికపై అత్యాచారం..
అసలు విషయంలోకి వెళ్తే.. ఒక పదహారేళ్ల అమ్మాయి సినిమాలలో నటించడం అంటే చాలా ఇష్టం. కానీ ఎదుటి వాళ్లకు అది సాకుగా మారింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ ఆమెను నమ్మించారు. వారి మాయమాటలకు మోసపోయిన ఆ బాలిక సినిమాల్లో ఎలాగైనా నటించాలని వాళ్ల దగ్గరకు వెళ్ళింది. అలా వెళ్ళిన వారు నటి మిను మునీర్ సమక్షంలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇది జరిగిన పదేళ్ల తర్వాత ఆ యువతి తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులతో చెప్పి పోలీసులను ఆశ్రయించింది. ఇంతకాలం భయంతో గడిపానని , ఇప్పుడు తనకు న్యాయం కావాలి అంటూ తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అత్యాచారం కేసులో మలయాళ నటి మిను మునీర్ ను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా అవకాశం ఇప్పిస్తానంటే చెన్నై వచ్చానని, అయితే తనపైన నలుగురు వ్యక్తులు అత్యాచారానికి వడిగట్టారని ఆ బాలిక తెలిపింది.
ప్రముఖ నటి అరెస్ట్..
పోలీసులు తెలిపిన వివరాల మేరకు పదేళ్ల క్రితం ప్రముఖ మలయాల నటి మిను మునీర్ సినిమాలలో నటించేలా చేస్తానని చెప్పి.. తన బంధువు కుమార్తె అయిన 16 ఏళ్ళ బాలికను చెన్నై తీసుకొచ్చిందట. ఆ తర్వాత ఒక ప్రైవేట్ హోటల్లో ఆ బాలికను ఉంచింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పదేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చెన్నై తిరుమంగళం ఆల్ వుమన్ పోలీసులు గురువారం నటి మిను మునీర్ ను అరెస్టు చేశారు. అనంతరం చెన్నైకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
వేసవి సెలవుల కోసం వెళ్ళిన బాలికపై అత్యాచారం..
ఇకపోతే ప్రస్తుతం ఆ యువతి వయసు 26 సంవత్సరాలు. గత సంవత్సరం కేరళ పోలీసులు తమకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఆ తర్వాత ఆ ఫిర్యాదును చెన్నైలోని పోలీస్ స్టేషన్కు బదిలీ చేయగా 2014లో పాఠశాల సెలవుల్లో తన కుమార్తెను తన దూరపు బంధువైన మిను ఇంటికి సినిమాలలో అవకాశం కోసం పంపించానని బాధితురాలు తల్లి ఆరోపించింది.
మిను మునీర్ సినిమాలు..
ఈమె విషయానికి వస్తే.. కేరళలోని ఎర్నాకులంకు చెందిన ఈమె అసలు పేరు మిను కురియన్.. 2008 నుండి 2018 వరకు వివిధ మలయాళం, తెలుగు, తమిళ్ చిత్రాలలో, కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించింది. ఇక ఇప్పుడు బాలికపై అత్యాచార కేసులో అరెస్ట్ అయింది.
also read: War 2: వీరమల్లును కూడా దాటలేకపోయిన వార్ 2..పాపం తారక్ ఫ్యాన్స్!