Indian Railways: సాధారణంగా ప్రయాణ సమయంలో రైలు ప్రయాణీకులకు ఏవైనా సమస్యలు ఎదురైతే, వెంటనే సిబ్బంది వచ్చి పరిష్కరించే ప్రయత్నిస్తారు. తాజాగా ఓ రైల్లో ఏసీ రాకపోవడంతో ప్రయాణీకులు ఫిర్యాదు చేశారు. వెంటనే టెక్నీషియన్లు వచ్చి ఏసీ డక్ట్ ఓపెన్ చేసి చూసి పరేషాన్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యారు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తాజాగా లక్నో–బరౌని ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్ 15204) ప్రయాణ సమయంలో ఏసీ నుంచి చల్లదనం రాలేదు. ఈ నేపథ్యంలో కోచ్ లోని ప్యాసింజర్స్ ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. వెంటనే రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు. రైల్వే సిబ్బంది వెంటనే టెక్నీషియన్లు పిలిచారు. టెక్నీషియన్లు డక్ట్ కవర్ తీసి లోపల చూడగానే షాక్ అయ్యారు.
ఏసీకి అడ్డంగా మద్యం సీసాలు
ఏసీ రాకపోవడానికి కారణం టెక్నికల్ సమస్య కాదని టెక్నీషియన్లు గుర్తించారు. గ్యాస్ లీకేజీ, మోటార్ సమస్యలు ఏమీ లేదు. ఏసీ రాకపోవడానికి అసలు కారణం.. ఫ్యాన్ కు ఎదురుగా మద్యం సీసాలు పేర్చడం. డక్ట్ లోపల ఏకంగా 300లకు పైగా మద్యం సీసాలను పెట్టారు. వాటిలో 256 ఆఫీసర్స్ ఛాయిస్ బాటిళ్లు, 60 ఆఫ్టర్ డార్క్ బ్లూ విస్కీ బాటిళ్లతో సహా మొత్తం 316 బాళ్లు కనిపించాయి. ఇందులో సుమారు 57 లీటర్ల అక్రమ మద్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
విచారణ మొదలు పెట్టిన రైల్వే అధికారులు
రైల్వే అధికారులు ఈ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసాలు రైలు కోచ్ లోకి ఎలా వచ్చాయి. వాటిని ఏసీ డక్ట్ లో ఎవరు పెట్టార? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కోచ్ ను చాలా కాలంగా మద్యం అక్రమ రవాణా కోసం ఉపయోగిస్తున్నట్లు రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సోన్ పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ స్పందించారు. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నట్లు తెలిపారు. అక్రమ మద్యాన్ని సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆ తర్వాత ఏసీ కూలింగ్ సమస్యను సాల్వ్ చేసినట్లు చెప్పారు.
Passengers complained of low cooling in the AC coach of Lucknow-Barauni Express. When the technicians inspected the AC duct, consignment of a illict liquor was being hidden there.
Tecnologia! pic.twitter.com/Qad9Uis9dO
— Piyush Rai (@Benarasiyaa) August 14, 2025
అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న రైల్వే సిబ్బంది!
అక్రమంగా మద్యం రవాణా చేయడం వెనుక బీహార్ లోని ఖగారియా జిల్లాకు చెందిన కోచ్ అటెండెంట్ ఆశిష్ కుమార్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆశిష్ ఉత్తర ప్రదేశ్ నుంచి బీహార్ కు క్రమం తప్పకుండా మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు. అశిష్ ను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడు రిమాండ్ లో ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా ఏసీ సమస్య గురించి ఆరా తీస్తే, అక్రమ మద్యం రవాణా వ్యవహారం బయటకు రావడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు.
Read Also: తిరుమలలో ఈ రహస్య నీటి కొలను గురించి తెలుసా? ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు!