BigTV English

BRS Politics: కారు రోడ్డుపైకి వస్తుందా? గంటల వ్యవధిలో కేసీఆర్‌తో కొడుకు-కూతురు భేటీ వెనుక

BRS Politics: కారు రోడ్డుపైకి వస్తుందా? గంటల వ్యవధిలో కేసీఆర్‌తో కొడుకు-కూతురు భేటీ వెనుక

BRS Politics: బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? షెడ్డు నుంచి కారు రోడ్డుపైకి వస్తుందా? ఫామ్‌హౌస్ నుంచి పార్టీ వ్యవహారాలను కేసీఆర్ పర్యవేక్షణ చేస్తున్నారా? ఉన్నట్లుండి శుక్రవారం కేసీఆర్‌తో కవిత సమావేశం వెనుక ఏం జరిగింది? ఆ తర్వాత కేటీఆర్ భేటీ వెనుక మతలబు ఏంటి? ఇవే ప్రశ్నలు చాలామంది వెంటాడుతున్నాయి.


తెలంగాణలో రేపో మాపో జూబ్లీహిల్స్ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కారు పార్టీలో అంతర్గత వ్యవహారాలపై చర్చకు కారణమైన కవిత తన తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు ఫామ్ హౌస్‌కు వెళ్లారు. అదే సమయంలో పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ నుంచి పిలుపు రావటంతో ఏదో జరుగుతోందన్న చర్చ అప్పుడే మొదలైంది.

శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్‌తో కవిత భేటీ అయ్యారు. కొడుకుని కాలేజీలో చేర్చేందుకు అమెరికా వెళ్తున్నారు ఆమె. రెండువారాల పాటు అక్కడే ఉండనున్నారు. విదేశాలకు వెళ్ళేముందు తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకునేందుకు కొడుకుతో కలిసి ఫామ్ హౌస్‌‌కు వెళ్లారు. కవిత కుమారుడు ఆర్యను గ్రాడ్యుయేషన్‌లో చేరనున్నాడు.


ఈ నేపథ్యంలో ఫామ్‌హౌస్‌కు కవిత వెళ్లారు. శనివారం వేకువజామున శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు వెళ్లనున్నారు కవిత. సెప్టెంబర్ ఒకటిన తిరిగి కవిత హైదరాబాద్‌కు రానున్నారు. ఈ వ్యవహారం జరుగుతుండగా కేటీఆర్, హరీష్ సహా పార్టీ కీలక నేతలు ఫామ్ హౌస్‌కు రావాలని కేసీఆర్ నుంచి వర్తమానం వెళ్లింది.

ALSO READ: అపోహాలు నమ్మవద్దు.. అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్ర-సీఎం రేవంత్

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నేతలు అక్కడికి వెళ్లారు. ఈ భేటీలో పలు అంశాలపై కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వాటిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ  సమావేశాల్లో కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చించనున్నారు.

కాళేశ్వరం రిపోర్టుపై ఏ విధంగా అడుగులు వేయాలి? అదేదానిపై నేతలతో మంతనాలు జరపనున్నారట. కొద్దిరోజులుగా పార్టీపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేలా అధినేత ప్రణాళికలు సిద్ధం చేశారని తెలుస్తుంది. ఇదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ సభ ఏర్పాటు చేయాలన్నది పార్టీ పెద్దల మాట. దీనిపై ఓ నిర్ణయం రావచ్చని అంటున్నారు. మరి నేతల భేటీలో ఇవేకాకుండా ఇంకా ఏమైనా అంశాలు చర్చకు వస్తాయా? లేవా అన్నది చూడాలి.

Related News

Karimnagar news: వృద్ధాప్య పెన్షన్ పంపకంలో తేడా.. తల్లిని వదిలేసిన కుమారులు.. చివరికి?

Cm Revanth Reddy: అపోహలు నమ్మొద్దు.. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు

తలకిందులుగా జాతీయ జెండా ఎగరేసిన తహసీల్దారు.. చర్యలు తప్పవా?

Banakacherla Project: తగ్గేదేలే.. బనకచర్ల ప్రాజెక్టుపై ఇద్దరు సీఎంల మాటల యుద్ధం

CM Revanth Reddy: గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Big Stories

×