Fauji: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ‘బాహుబలి’ సినిమా తర్వాత జోరు పెంచిన విషయం తెలిసిందే. వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ.. పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. అంతేకాదు ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఆయన రేంజ్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి. చివరిగా ‘కల్కి 2898AD’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ఇప్పుడు మారుతీ (Maruthi) దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?
మరోవైపు ‘సీతారామం’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ (Fauji) సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అయితే ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా.. తాజాగా ఒక వార్త అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా విడుదల తేదీ పై ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ ఫౌజీ చిత్రాన్ని 2026 ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ ఫౌజీ సినిమా విశేషాలు..
పీరియాడికల్ వార్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మిథున్ చక్రవర్తి(Mithun Chakraborty), అనుపమ్ ఖేర్ (Anupam Kher), జయప్రద (Jayaprada) వంటి సీనియర్స్ కూడా ఇందులో భాగం అయ్యారు. స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో జరిగిన కథగా దీనిని రూపొందిస్తున్నారు. ధైర్యం, ప్రేమ, త్యాగం వంటి ఇతివృత్తాల చుట్టూ ఈ సినిమా సాగుతుంది అని సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి ఇస్మాయిల్ ను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే ప్రభాస్ సినిమాలో అవకాశం కొట్టేయడంతో ఈమెపై అప్పట్లో అభిమానులలో మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇమాన్వి.. ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును అందుకుంటుందో చూడాలి.
ప్రభాస్ సినిమాలు..
ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే సలార్ 2, కల్కి2 చిత్రాలతో పాటు స్పిరిట్ వంటి చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటన్నింటిని ఒక సినిమా తర్వాత మరొకటి రిలీజ్ చేసి అభిమానులకు మంచి కిక్ ఇవ్వబోతున్నారు ప్రభాస్. ఇక త్వరలో ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.
also read:Jatadhara Teaser: సుధీర్ బాబు జటాధర మూవీ టీజర్ రిలీజ్!