Manchu Manoj: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. రేపే ఎదురువుతుంది.. ఇంకా తెలవరాదేమి అంటూ పాడుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. రీమేక్ లతో అలసిసొలసిపోయిన ప్రాణాలు.. చాలాకాలం తరువాత అసలు సిసలైన పవన్ కళ్యాణ్ యాక్షన్ ను చూడబోతున్నారు. అందుకే ఫ్యాన్స్ కు నిద్ర కూడా ఉండడం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రేయారెడ్డి తదితరులు నటిస్తున్నారు.
ఇక ఓజీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ క్రియేట్ చేసింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూడాలా అని అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక రేపు సినిమా రిలీజ్ కావడంతో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సెలబ్రిటీలు ఓజీ పెద్ద హిట్ కావాలని కోరుతూ పవన్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు.
తాజాగా మంచు వారబ్బాయి మంచు మనోజ్.. ఓజీకి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఎక్స్ వేదికగా ఓజీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. “ఓజీ సినిమా హైప్, దాని మ్యాడ్ నెస్ నాకు చాలా బాగా నచ్చింది. నా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఓజీ చిత్ర బృందానికి మెగా బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు. థియేటర్లలో ఇది ఒక తుఫానుగా మారుతుందని నేను 200% ఖచ్చితంగా అనుకుంటున్నాను. పవర్ స్టార్ ఆవేశాన్ని, గర్జనను సెలబ్రేట్ జరుపుకోవడానికి వేచి ఉండలేకపోతున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక మనోజ్ కెరీర్ గురించి చెప్పాలంటే.. మిరాయ్ తో అతని లైఫ్ మారిపోయింది. ఈ సినిమా ఇచ్చిన హిట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలని కష్టపడుతున్నాడు. మిరాయ్ తరువాతఒక పక్క హీరోగా చేస్తూనే.. ఇంకోపక్క విలన్ గా కొనసాగనున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం చిరు – బాబీ సినిమాలో మనోజ్ విలన్ గా సెలెక్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలతో మనోజ్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.
Loved the hype and madness for #OG ! Wishing my Anna, the Power Star @PawanKalyan garu & the entire team a Mega Blockbuster. I'm 200% sure it's going to be a firestorm in theatres…🔥Can’t wait to witness the rage and roar, and celebrate the Power Star.❤️
My best wishes to Dear… pic.twitter.com/mAtWFW6qmq
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 24, 2025