Raksha Bandhan Special Trains: పండుగలు, ప్రత్యేక వేడుకల నేపథ్యంలో భారతీయ రైల్వే తగిన చర్యలు తీసుకుంటున్నది. ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వరుస పండుగల నేపథ్యంలో ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. రక్షా బంధన్, స్వాతంత్ర్య దినోత్సవం, గణేష్ చతుర్థి పండుగల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
సింద్రాబాద్ నుంచి మైసూరుకు ప్రత్యేక రైలు
పండుగల రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ -మైసూరుకు బెంగళూరు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు (07033) ఆగస్టు 8, 11, 18, 29 తేదీలలో సికింద్రాబాద్ నుంచి రాత్రి 10.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మైసూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (07034) ఆగస్టు 9, 12, 19, 30 తేదీలలో మైసూరు నుంచి సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
పలు రైళ్లు రద్దు చేసిన అధికారులు
ఓవైపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న భారతీయ రైల్వే అదే సమయంలో మరికొన్ని రైళ్లను క్యాన్సిల్ చేసింది.
⦿ హైదరాబాద్ నుంచి యెలహంక మీదుగా అర్సికెరెకు మంగళవారాల్లో నడిచే రైలు (నంబర్ 07069) ఆగస్టు 12, 19, 26 తేదీలలో రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో, బుధవారం నడిచే అర్సికెరె నుంచి హైదరాబాద్‌కు నడిచే రైలు (నంబర్ 07070) ఆగస్టు 13, 20, 27 తేదీలలో రద్దు చేయబడుతుంది.
Read Also: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?
⦿ ఆదివారాల్లో నడిచే సికింద్రాబాద్- అర్సికెరెకు రైలు నంబర్ (07079) ఆగస్టు 10, 17, 24, 31 తేదీలలో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో, సోమవారాల్లో నడిచే అర్సికెరె- సికింద్రాబాద్ రైలు (నంబర్ 07080) ఆగస్టు 11, 18, 25, సెప్టెంబర్ 1 తేదీలలో రద్దు చేయబడుతుందన్నారు. ఈ విషయం తెలుసుకుని రైల్వే ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
Read Also: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!