Jatadhara Teaser:బ్లాక్ బస్టర్ హిట్ కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న ప్రముఖ హీరో సుధీర్ బాబు (Sudeer babu) తాజాగా నటిస్తున్న చిత్రం జటాధర. ప్రముఖ డైరెక్టర్ వెంకట కళ్యాణ్ (Venkata Kalyan) దర్శకత్వంలో తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతున్నట్లు టీజర్ తోనే రివీల్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ తో పాటు ఇంద్ర కృష్ణ, నవీన్, శుభలేఖ సుధాకర్, రవి ప్రకాష్, ఝాన్సీ, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుణ అగర్వాల్, శివన్ నారంగ్, ప్రేరణ అరోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
జటాధర సినిమా టీజర్ ఎలా ఉందంటే?
సినిమా టీజర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఇందులో సోనాక్షి సిన్హాకే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చినట్టు టీజర్ లో తెలుస్తోంది. టీజర్ లాస్ట్ లో శివుడి పాదం పెట్టారు.. అంటే ఈ సినిమాలో కూడా శివుడి ఎంట్రీ ఉంటుందా? ఈమధ్య ఎక్కువగా సినిమాలకు క్లైమాక్స్ లో దేవుళ్లను తీసుకురావడం పరిపాటిగా వస్తోంది. ఇదివరకే ఓదెలా 2 క్లైమాక్స్ లో కూడా శివుడిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జటాధర టీజర్ క్లైమాక్స్ లో కూడా శివుడి పాదం చూపించడం ఆశ్చర్యంగా మారింది. ఇకపోతే ఈ సినిమా టీజర్ చూశాక లేడీ ఓరియంటెడ్ మూవీనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించినా.. చాలామంది పలు రకాల అనుమానాలు లేవనెత్తుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే పూర్తి కథ తెలిసే వరకు ఎదురు చూడాల్సిందే
సుధీర్ బాబు కెరియర్..
సుధీర్ బాబు కెరియర్ విషయానికి వస్తే.. సమంత (Samantha ) – నాగచైతన్య (Naga Chaitanya) కాంబినేషన్లో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ సినిమాలో హీరోయిన్ కి అన్నయ్య పాత్రలో నటించి కెరియర్ మొదలుపెట్టిన ఈయన.. ‘ఎస్ఎంఎస్’ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రేమ కథా చిత్రం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఇలా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఈయన ఖాతాలో భారీ సక్సెస్ అయితే ఇప్పటివరకు పడలేదని చెప్పాలి. ప్రస్తుతం జటాధర అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాతో నైనా సుధీర్ బాబు మంచి విజయం అందుకుంటారా అనే అనుమానాలు టీజర్ రేకెత్తిస్తోంది.
ALSO READ:Book My Show Tickets: గంటలోనే లక్ష టికెట్లు… బాక్సాఫీస్‌పై ఊచకోత ఇది!