Anaconda Reboot Telugu Trailer: కొన్ని హాలీవుడ్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. జురాసిక్ వరల్డ్, అనకోండ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సినీ అభిమానులు ఉన్నారు. ఈ ప్రాంచైజీల నుంచి సినిమా వస్తుందంటే.. మూవీ లవర్స్కి పండగే. ముఖ్యంగా హాలీవుడ్లో వచ్చిన జూరాసిక్ పార్క్, అనకొండ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. 1997లో వచ్చిన ఈ చిత్రం ఎన్నో రికార్డ్స్ నెలకొల్పింది. ఇప్పుడు ఈ ప్రాంఛైజ్ నుంచి మరో చిత్రం రాబోతంది. పాల్ రుడ్, జాక్ బ్లాక్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ డిసెంబర్ క్రిస్మస్ కానుగా డిసెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది.
ఇండియాలో వివిధ భాషల్లోనూ ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఇంగ్లీష్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మాణంలో టామ్ గోర్మికన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ఇండియాలో కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. గత చిత్రాలు సస్పెన్స్ థ్రిల్లర్‌తో బయపెట్టాయి. కానీ, ఈసారి భయంతో పాటు కామెడీని కూడా చూపించబోతున్నారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. డాగ్(జాగ్ బ్లాక్), గ్రీఫ్ (పాల్ రుడ్) మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి అనకొండ సినిమాను కామెడీ తరహాలో రిమేక్ చేయాలని కలలు కంటారు. ఇందుకోసం వారి కలను నిజం చేసుకొవడానికి కొంతమంది బృందంతో కలిసి అమెజాన్ అడవులలోకి వెళతారు. అయితే అమెజాన్ ఫారెస్ట్‌లోకి వెళ్లిన అనంతరం వారికి ఒక భారీ అనకొండ ఎదురవుతుంది. దీంతో వారు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది సినిమా స్టోరీ. జాక్ బ్లాక్, పాల్ రుడ్ తో పాటు ఈ సినిమాలో సెల్టన్ మెల్లో, డానియేలా మెల్చియర్, తండివే న్యూటన్, స్టీవ్ జాన్ లు ముఖ్య పాత్రల్లో నటించారు.
Also Read: MSG Movie: అది చిరు రేంజ్.. అప్పుడే ఉత్తరాంధ్ర థియేట్రికల్ రైట్స్ క్లోజ్, ఎవరు తీసుకున్నారంటే!
కాగా 1997లో విడుదలైన అనకొండ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఆకట్టుకుంది. జెన్పిఫర్ లోపెజ్, లూయిస్ లోసా దర్శకత్వం వహించిన ఈ సినిమా హారర్-కామెడీ శైలీలో వచ్చి ప్రేక్షకుల మన్నలలు పొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రేక్షాకారణ పొందింది. ఓ రిసెర్చ్ కోసం వెళ్లిన బృందానికి.. అడవిలో భారీ అనకొండ ఎదురపడటం.. అది ఒక్కొక్కరికి చంపుతు ఆ బృందాన్ని బయపెట్టిన తీరు ఆడియన్స్ ని ఉత్కంఠకు గురి చేసింది. ఆ తర్వాత ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చని అనకొండ: ది హంట్ ఆఫ్ బ్లడ్ ఆర్చిడ్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. స్పెస్పన్స్ థ్రిల్లర్‌తో పాటు కామెడీ తరహాలో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న ఈ చిత్రంలో సస్పెన్స్తో పాటు కామెడీపై కూడా దృష్టి పెట్టారనిపిస్తోంది.