పామును చూసినా, చివరిక పాము పేరు విన్నా వెన్నులో ఓ రకమైన సన్నని వణుకు మొదలవుతుంది. పాము కనిపిస్తే, ఆ పరిసరాలకు కూడా వెళ్లే ప్రయత్నం చేయం. కానీ, తాజాగా ఓ వెటర్నరీ డాక్టర్ ఏకంగా పాముకే వైద్యం అందించాడు. ప్రాణాపాయం నుంచి బయటపడేశాడు. వైద్యుడు చేసిన పని పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన కాటిపాముల వ్యక్తి దగ్గర పాములు ఉన్నాయి. పాములు ఆడిస్తూ తన జీవితాన్ని గడుపుతున్నాడు. తాజాగా తన ఇంటి సజ్జ మీది నుంచి గడ్డపార తీస్తుండగా జారి పడింది. అది నేరుగా కింద ఉన్న పాము మీద పడింది. ఒక్కసారిగా పాము పొట్ట పడిగిలింది. పొట్టలోంచి ఎయిర్ బ్లాడర్, పేగులు బయటకు వచ్చాయి. పాము కదల్లేని పరిస్థితికి చేరుకుంది. ఎలాగైనా పామును కాపాడుకోవాలని భావించిన ఆయన.. దాన్ని తీసుకుని సిరిసిల్ల పశు వైద్యశాలకు వెళ్లాడు.
అక్కడ ఉన్న వెటర్నరీ డాక్టర్ అభిలాష్ కు సదరు కాటిపాముల వ్యక్తి విషయం చెప్పాడు. తమ పామును కాపాడాలని కోరాడు. పాము పరిస్థితిని గమనించిన డాక్టర్ అభిలాష్ ముందుగా బయటకు వచ్చిన ఎయిర్ బ్లాడర్ పేగులను సరి చేశాడు. వాటిని నెమ్మదిగా కడుపులోకి నెట్టాడు. ఆ తర్వాత సుమారు ఆరు అంగుళాల పొడవు కుట్లు వేశాడు. పాము ప్రాణాలు కాపాడేందుకు అసవరమైన ఇంజెక్షన్లు వేయడంతో పాటు సెలైన బాటిళ్లు పెట్టాడు.
Read Also: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?
ఆ పాముకు మూడు రోజుల పాటు తన అబ్జర్వేషన్ లో ఉంచుకున్నాడు డాక్టర్ అభిలాష్. ఆ తర్వాత నెమ్మదిగా కదలడం మొదలు పెట్టింది. ప్రాణాపాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ పామును సదరు వ్యక్తి అప్పగించాడు. ప్రస్తుతం పాము ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు అభిలాష్ చెప్పాడు. అయితే, కొద్ది రోజుల పాటు దానిని జాగ్రత్తగా చూసుకోవాలని సదరు పామును తీసుకొచ్చిన వ్యక్తి సూచించాడు. కొన్ని మందులను కూడా అందించాలని చెప్పాడు. అటు తమ పామును కాపాడిన డాక్టర్ కు కాటిపాముల వ్యక్తి వ్యక్తి కృతజ్ఞతలు చెప్పాడు. చనిపోతుందనుకున్న పామును కాపాడటం సంతోషంగా ఉందన్నారు. పామును కాపాడేందుకు డాక్టర్ ఎంతో కృషి చేసినట్లు వెల్లడించారు. ఆయన కృషి ఫలించి ప్రస్తుతం కోలుకుంటుందన్నారు. పాములకు కూడా చికిత్స చేసి ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్ అభిలాష్ నిరూపించారని సంతోషం వ్యక్తం చేశాడు. అటు పామును ప్రాణాలను కాపాడిన విషయం తెలియడంతో స్థానికులతో పాటు నెటిజన్లు డాక్టర్ ను ప్రశంసిస్తున్నారు.