Bandla Ganesh: బండ్ల గణేష్(Bandla Ganesh) పరిచయం అవసరం లేని పేరు. కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా కొనసాగిన బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా సక్సెస్ అందుకున్నారు.ఇలా నిర్మాతగా కొనసాగుతున్న సమయంలోనే ఈయన రాజకీయాల వైపు అడుగులు వేశారు. అయితే బండ్ల గణేష్ అటు రాజకీయాలలోనూ పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు కానీ తను మాత్రం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తానట్టు చెప్పుకు వచ్చారు.
ఇలా రాజకీయాలకు దూరంగా ఉండటమే కాకుండా సినిమాలకు కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి బండ్ల గణేష్ దూరంగా ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీకి, సినీ సెలబ్రిటీలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ చేసే వ్యాఖ్యలు మాత్రం సంచలనగా మారుతూ ఉంటాయి. ఇటీవల లిటిల్ హార్ట్సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా అల్లు అరవింద్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఇలా ఈ వివాదం గురించి మర్చిపోకముందే మరోసారి ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే ఈయన ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారనేది మాత్రం తెలియదు కానీ ఇది మాత్రం సంచలనంగా మారింది.
కృతజ్ఞత లేని వ్యక్తులు..
బండ్ల గణేష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..”కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు.నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు. కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు” అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటి? ఎవరిని ఉద్దేశించి చేశారనేది మాత్రం ఎక్కడ తెలియచేయలేదు. ఇక ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు నీ గురించి నువ్వే ఇలా చెప్పుకున్నట్టు ఉంది బండ్లన్న అంటూ కామెంట్లు చేయగా మరి కొంతమంది ఈరోజు ఓజి సినిమాని ఎక్కడ చూస్తున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు.
నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు.
కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు.— BANDLA GANESH. (@ganeshbandla) September 24, 2025
ఇకపోతే బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్ కచ్చితంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసినట్టే ఉందని మరికొంతమంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఓజీ ఈవెంట్ కు రావాలని బండ్ల గణేష్ ఎంతో ఆశపడ్డారు కానీ ఆయనకు పిలుపు అందకపోవడంతోనే హర్ట్ అయ్యి ఇలాంటి పోస్ట్ చేసి ఉంటారు అంటూ మరికొందరు భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం మొదలుపెడితే ఆయన పూనకం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ తన భక్తిని చాటుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్ కలవకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని పలు సందర్భాలలో ఈయన పోస్టులు చేసిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఒకసారి కూడా బండ్ల గణేష్ తనని కలవకపోవడం గమనార్హం.
Also Read: Dharma Mahesh: రీతూతో రిలేషన్ పై ఓపెన్ అయిన ధర్మ మహేష్… నిరూపించాలంటూ ఛాలెంజ్!