Sonu Sood: ప్రముఖ సినీ నటుడు సోను సూద్ (Sonu Sood)పట్ల ఇటీవల బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో భాగంగా కేసు నమోదు అయిన విషయం మనకు తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం వల్ల ఎంతోమంది ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఈ బెట్టింగ్ యాప్ ఉచ్చులో పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారిపై కేసులు నమోదు కావడంతో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఈడీ ముందు విచారణకు హాజరవుతున్నారు. అయితే తాజాగా నటుడు సోను సూద్ సైతం ఢిల్లీలోని(Delhi) ఈడీ (ED)అధికారుల విచారణకు హాజరయ్యారు.
నేడు విచారణకు హాజరు కావాలి అంటూ ఈడి అధికారులు ఈయనకు సెప్టెంబర్ 17వ తేదీ నోటీసులను జారీ చేశారు. ఈ క్రమంలోనే సోనూ సూద్ అధికారుల ముందుకు వచ్చారు. ఈ విచారణలో భాగంగా సోనుసూద్ ప్రమోట్ చేసిన 1×బెట్ యాప్, మనీలాండరింగ్ కు సంబంధించిన నగదు లావాదేవీల గురించి ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన విచారణ కొనసాగుతుంది. ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో భాగంగా పలువురు క్రికెటర్ల పై కూడా కేసులు నమోదు కావడంతో వారు కూడా ఈ విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది. ఇలా క్రికెటర్లు బాలీవుడ్ నటులపై మాత్రమే కాకుండా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ ప్రమోషన్లలో భాగంగా ఈడీ విచారణకు హాజరయ్యారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్..
బెట్టింగ్ యాప్స్ ద్వారా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున సంపాదించుకోగా ఎంతోమంది నష్టపోతున్న నేపథ్యంలోనే ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నటుడు సోను సూద్ కూడా విచారణకు హాజరయ్యారు. సోనూ సూద్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తున్న సోనూ సూద్ మాత్రం నిజ జీవితంలో హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఈయన చేసిన సహాయ సహకారాలు ఎవరు మర్చిపోరనే చెప్పాలి.
నిజ జీవితంలో హీరోగా…
కరోనా వంటి భయంకరమైన విపత్కర పరిస్థితులలో కూడా ఎంతోమందికి నేనున్నా అంటూ అభయమిచ్చిన సోనూ సూద్ తన సొంత డబ్బును ఖర్చు చేసి ఎంతో మందిని వారి స్వస్థలాలకు చేర్చడమే కాకుండా పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలిండర్లను కూడా సరఫరా చేస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఇకపోతే ఇప్పటికీ కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారనే విషయం సోనూసూద్ దృష్టికి వెళ్తే వెంటనే వారికి నేను ఉన్న అంటూ వారి అవసరాలను తీరుస్తూ మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇలా ఒకవైపు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలు చేస్తూ నటుడిగా కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Bandla Ganesh: కృతజ్ఞత లేని వ్యక్తి అంటూ మరో ట్వీట్ వేసిన బండ్లన్న… అదే కారణమా?