BigTV English

Jyothi Poorvaj: ఓర్నీ.. మన జగతీ ఆంటీ కూడా పవన్ ఫ్యానేరా.. ఎంత హాట్ గా ప్రమోట్ చేస్తుందో

Jyothi Poorvaj: ఓర్నీ.. మన జగతీ ఆంటీ కూడా పవన్ ఫ్యానేరా.. ఎంత హాట్ గా ప్రమోట్ చేస్తుందో

Jyothi Poorvaj:కన్నడ నటి జ్యోతి పూర్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జ్యోతి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు.. అదే గుప్పెడంత మనసు సీరియల్లో జగతి ఆంటీ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. గుప్పెడంత మనసు సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే.  ఆ సీరియల్ లో హీరోకి తల్లిగా జగతి అనే పాత్రలో జ్యోతి నటించింది. ఈ సీరియల్ ద్వారా ఆమె స్టార్ గా మారింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


ఇక ఈ సీరియల్ తర్వాత ఆమె కన్నడలో కూడా స్టార్ గా మారింది. సీరియల్ మధ్యలోనే జ్యోతి వెళ్ళిపోయినా కూడా ఆమెను తెలుగు అభిమానులు అంత త్వరగా మరిచిపోలేదు. ఇక జ్యోతి తెలుగు డైరెక్టర్ పూర్వాజ్ ను  ప్రేమించి, రెండో పెళ్లి చేసుకుంది. అనంతరం ఆమె హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం జ్యోతి చేతిలో అరడజన్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి కిల్లర్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో జ్యోతి బిజీగా మారింది.

ఇక సినిమాల విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్  ఉందనే చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో జగతి ఆంటీ ఎప్పుడు ముందే ఉంటుంది. ఇక ఎలాంటి వివాదాలు, విమర్శలు వచ్చినా కూడా ఆమె అవేమీ పట్టించుకోకుండా తన సినిమాలకు ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది.


తాజాగా ఈ భామ పవన్ ఫ్యాన్స్ ను షాక్ కి గురి చేసింది. ఎందుకు అంటే జ్యోతి కూడా పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అని తెలుస్తోంది. రేపు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అందులో జ్యోతి కూడా ఒకరు.

పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన జ్యోతి ఓజీ కోసం వేచి ఉండలేకపోతున్నా అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వైట్ టాప్.. దానిపై ఓజీ అనే అక్షరాలు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. వెనుక బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ అక్షరాలను జోడించి ఉన్న ఈ ఫోటోలు  నెట్టింట వైరల్ గా మారాయో. ఈ ఫోటోలు చూసిన పవన్ ఫ్యాన్స్ ఓర్నీ.. మన జగతీ ఆంటీ కూడా పవన్ ఫ్యానేరా.. ఎంత హాట్ గా ప్రమోట్ చేస్తుందో కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం.. ఏదిఏమైనా జగతి ఆంటీ అందమే అందంరా అని చెప్పుకొస్తున్నారు. మరి రేపు జ్యోతి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ఓజీ చూస్తుందేమో చూడాలి.

Related News

Dharma Mahesh: రీతూతో రిలేషన్ ఓపెన్ అయిన ధర్మ మహేష్… నిరూపించాలంటూ ఛాలెంజ్!

Manchu Manoj: ఓజాస్ గంభీరకు బ్లాక్ స్క్వార్డ్ బెస్ట్ విషెస్..

MSG Movie: అది చిరు రేంజ్.. అప్పుడే ఉత్తరాంధ్ర థియేట్రికల్‌ రైట్స్‌ క్లోజ్, ఎవరు తీసుకున్నారంటే!

Manchu Manoj: మనోజ్ క్యారెక్టర్ ఆ స్టార్ హీరో చేస్తే మిరాయ్ హిట్ అయ్యేదా.. ?

OG Bookings : ఛీ ఛీ.. కాసులకు కక్కుర్తి పడి.. బ్లాక్ టికెట్స్ దందాలోకి డిస్ట్రిబ్యూటర్స్ ?

OG Movie: మిరాయ్ థియేటర్లు ఓజీకి.. పవన్ భయపెట్టాడా.. ?

OG Movie: ఉండే గంటకు అంత హైప్ ఎందుకురా బుజ్జి..

Big Stories

×