Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ(OG). సుజిత్(Sujeeth) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇకపోతే ఈ సినిమా ప్రీమియర్ నేడు సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రసారం కానున్న నేపథ్యంలో అభిమానుల హడావిడి కూడా మొదలైంది. తమ అభిమాన హీరోని యాక్షన్ మోడ్ లో చూసి చాలా కాలం అవుతున్న నేపథ్యంలో ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు మాత్రమే కాకుండా విదేశాలలో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రసారమవుతున్న థియేటర్లలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కట్అవుట్లను ఏర్పాటు చేస్తూ సెలబ్రేషన్స్ కి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో యూకే లోని పవన్ కళ్యాణ్ అభిమానులు వరుసన సెలవులు పెడుతున్న నేపథ్యంలో ఏకంగా కంపెనీ 25వ తేదీ సెలవును ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇక ఇదే విషయాన్ని సదరు కంపెనీ అధికారకంగా వెల్లడించింది.
ఉద్యోగులకు సెలవు…
సెప్టెంబర్ 25వ తేదీ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో కంపెనీకి సెలవుగా ప్రకటించింది. ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీ వారి కోసమే ఈ సెలవును ప్రకటించారు. అయితే 26వ తేదీ యధావిధిగా ఆఫీసుకు రావాలని తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఏకంగా కంపెనీ హాలిడే ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉందో స్పష్టమవుతుంది. అయితే ఇదివరకు రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటించిన కూలీ సినిమా(Coolie Movie) విషయంలో కూడా ఇలాగే జరిగింది కూలీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సింగపూర్ కి చెందిన ఒక కంపెనీ ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవును ప్రకటించారు.
ఓజీ పైనే అభిమానుల ఆశలు..
ఇలా గతంలో రజనీకాంత్ సినిమాకు ఒక ప్రైవేట్ కంపెనీ సెలవు దినం ప్రకటించగా తాజాగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు యూకే కి చెందిన మరొక కంపెనీ సెలవు ప్రకటించడంతో రజనీకాంత్ గారి తర్వాత అంతటి క్రేజ్ ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యమైంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ప్రస్తుతం ఓజీ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కి వచ్చిన ఆదరణ చూస్తుంటే మాత్రం పవన్ కెరియర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతుందని స్పష్టం అవుతుంది.
Also Read: Sonu Sood: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్… ఈడీ విచారణకు హాజరైన సోనూ సూద్