Mouli Tanuj: సినిమా సూపర్ హిట్ అయింది అంటే చాలు రాత్రికి రాత్రి తల రాతలు మారిపోతూ ఉంటాయి. కేవలం ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయి భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని క్రేజ్ ని సంపాదించుకున్న వారు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే యంగ్ హీరో కూడా ఒకరు. అప్పటివరకు వెబ్ సిరీస్ లలో నటిస్తూ నటుడిగా, మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో కేవలం ఒక్క సినిమాతోనే భారీగా క్రేజ్ ని ఏర్పరచుకున్నాడు.
ఒక్క సినిమా ఊహించని విధంగా అతని తలరాతను మార్చేసింది. ఆ హీరో మరెవరో కాదు మౌళి(Mouli). ఇటీవల విడుదల అయిన లిటిల్ హార్ట్స్ సినిమాతో భారీగా గుర్తింపును తెచ్చుకున్నాడు మౌళి. ఈ సినిమాతో అతని క్రేజ్ భారీగా పెరిగింది. ఈ సినిమాతో చాలామంది జాతకాలు మారిపోయాయి. అందులో హీరో మౌళి జాతకం కూడా ఒకటి. ప్రస్తుతం వరుసగా అవకాశాలు క్యూ కట్టడంతో పాటుగా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు మౌలికి అడ్వాన్సులు ఇస్తున్నాయట. ఇది ఇలా ఉంటే తాజాగా మౌళికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే తాజాగా మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ హీరో మౌళికి అడ్వాన్స్ ఇచ్చినట్టు సమాచారం. అది కూడా కోటి రూపాయల పారితోషికం ఇచ్చి మౌళితో అగ్రిమెంట్ చేయించుకొన్నారట.
అయితే డైరెక్టర్ ఎవరు అన్నది తెలియదు కానీ కేవలం అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకున్నారని తెలుస్తోంది. కాగా హీరో మౌళి లిటిల్ హార్ట్స్ సినిమాకు గాను కేవలం ఐదు నుంచి పది లక్షల లోపే రెమ్యూనరేషన్ అందుకోగా ఇప్పుడు రెండవ సినిమాకు ఏకంగా కోటి రూపాయల రేంజ్ కు వెళ్ళిపోయినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు ఈ వార్తపై స్పందించాడు హీరో మౌళి. ఈ మేరకు మౌళి స్పందీస్తూ.. ఎలాంటి ప్రొడక్షన్ హౌస్ నాకు కోటి రూపాయలు ఆఫర్ చేయలేదు. ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం ఆపేయండి అని నవ్వుతూ తెలిపారు.
రెండో సినిమా పనులలో బిజీగా మౌళి
ప్రస్తుతం రెండవ సినిమా కోసం పనిచేస్తున్నాను అని తెలిపారు హీరో మౌళి. ఈ సందర్బంగా మౌళి చేసిన ట్వీట్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ట్వీట్ తో మౌళికు ఎలాంటి నిర్మాణ సంస్థలు అడ్వాన్సులు ఇవ్వలేదని తేలిపోయింది. అయితే మౌళికి మాత్రం అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లిటిల్ హార్ట్స్ సినిమా తర్వాత మౌళి చేయబోయే సినిమాపై చాలానే అంచనాలు ఉన్నాయి. కానీ ఆ సినిమా ఏది అనేది ఇంతవరకు తెలియలేదు. కానీ తన ట్వీట్ లో మాత్రం రెండవ సినిమా కోసం పని చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Pooja hegde: పూజా హెగ్డే బర్త్డే.. స్పెషల్ విషెస్ తెలిపిన రూమర్ద్ బాయ్ ఫ్రెండ్.. ఫోటో వైరల్!