Raashii Khanna: ఊహల గుసగుసలాడే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయింది రాశి ఖన్నా. నటుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఇప్పటికీ కూడా ఆ సినిమా చూస్తుంటే మంచి ఫీల్ కలుగుతుంది. ముఖ్యంగా ప్రభావతి అనే పాత్ర విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఆ సినిమా తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు సాధించుకుంది. వెంకీ అట్లూరి దర్శకుడుగా పరిచయమైన తొలిప్రేమ సినిమా ఈమె కెరీర్ కు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. వరుణ్ కెరీర్ కి కూడా ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్. ఇక ప్రస్తుతం నేరజాకోన దర్శకత్వంలో చేస్తున్న తెలుసు కదా అనే సినిమాలో నటిస్తుంది రాశి కన్నా. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచింది.
ఎవరు సినిమా అయితే రిలీజ్ కి రెడీగా ఉందో ఆ సినిమా యూనిట్ ప్రముఖ షో సుమ అడ్డా కు ప్రమోషన్స్ కోసం హాజరవుతూ ఉంటారు. ఇలా చాలా సినిమాలు ఆ షో కి హాజరయ్యాయి. తెలుసు కదా చిత్ర యూనిట్ కూడా హాజరైంది. ఆ షో లో సిద్దు జొన్నలగడ్డ మొత్తం వన్ మాన్ షో. ఎపిసోడ్ కూడా చాలా బాగా వచ్చింది.
ఎక్కువ శాతం ఆ ఎపిసోడ్ లో రాశి ఖన్నా నవ్వుతూ కనిపించింది. ఈ విషయాన్ని పట్టుకొని సిద్దు జొన్నలగడ్డ మేము ఏమి చేసినా కూడా నువ్వు నవ్వుతూనే ఉండాలి అని వీళ్ళ పిఆర్ ఈమెకు చెప్పాడు అని చెప్పాడు. అది కూడా మంచి ఫన్ క్రియేట్ అయింది.
అది జరిగిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో, ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ తను ఒక పదాన్ని ఉపయోగించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆ పదం బూతు కాబట్టి దాని గురించి ఈరోజు రాశికి ఒక ప్రశ్న ఎదురైంది. అది బూతు అని నాకు తెలియదు అని క్లారిటీ ఇచ్చింది రాశి.
రాశి ఖన్నా మాట్లాడుతూ నా క్లోజ్ ఫ్రెండ్ నన్ను అలా పిలుస్తుంది అని చెప్పింది. ఈలోపు సిద్దు మాట్లాడబోతుంటే నీరజ కోన క్లారిటీ ఇచ్చారు. సినిమాలో బామ్మ క్యారెక్టర్ తనని అలా పిలుస్తుంది అని చెప్పింది.
వెంటనే రాశి ఖన్నా ఆ మాటను పట్టుకొని సినిమాలో బామ్మ క్యారెక్టర్ అలా పిలుస్తుంది. అది బూతు అని నాకు తెలియదు అందుకనే అలా మాట్లాడేసాను నాకు తర్వాత తెలిసింది అని చెప్పింది. అలా మాట్లాడినా కూడా క్యూట్ గానే ఉంది అంటూ ఆడియన్స్ ఆమెకు క్లారిటీ ఇచ్చారు.
Also Read: Meesala Pilla : ఇంకా ఎన్ని రోజులు ఇలాగా, టైం కి ఇవ్వకపోతే అనౌన్స్మెంట్ లు ఎందుకు