E-Paper
Advertisement

Prakash Raj: “బాలీవుడ్ ఒక ప్లాస్టిక్ విగ్రహాలున్న మ్యూజియం”.. సంచలన కామెంట్లు చేసిన ప్రకాష్ రాజ్

Prakash Raj: “బాలీవుడ్ ఒక ప్లాస్టిక్ విగ్రహాలున్న మ్యూజియం”.. సంచలన కామెంట్లు చేసిన ప్రకాష్ రాజ్
Advertisement

Prakash Raj:నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడతారని మనందరికీ తెలుసు. ఎన్నో సందర్బాలలో ఆయన విమర్శలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవల కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయన బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. హిందీ సినిమా తన ఆత్మను కోల్పోయిందని, కేవలం ప్లాస్టిక్ విగ్రహాలున్న మ్యూజియం లా మారిందని ఆయన విమర్శించడం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. కేవలం గ్లామర్ మీద ఆధారపడటం వల్లనే ప్రేక్షకులు బాలీవుడ్‌కు దూరమవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

దక్షిణాది వర్సెస్ ఉత్తరాది.. సృజనాత్మకతలో తేడా:

అసలు ఏమి జరిగిందంటే.. ప్రకాష్ రాజ్ కేవలం విమర్శించడమే కాకుండా, దక్షిణాది సినిమాల విజయ రహస్యాన్ని కూడా విశ్లేషించారు. మలయాళ, తమిళ చిత్రాలు కథలో సహజత్వాన్ని, మట్టి వాసనను,అక్కడి ప్రజల సమస్యలను చూపిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. అందుకే ఆ సినిమాలు భాషా పరిధులను దాటి అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. సృజనాత్మకత ఉన్నప్పుడే ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతారని, కేవలం భారీ బడ్జెట్ సెట్లు, మేకప్‌లతో ప్రేక్షకులను మాయ చేయలేమని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ప్రకాశ్ రాజ్ విమర్శలు వెనుక :

Advertisement

ఆయన చేసిన కామెంట్స్ నేటి డిజిటల్ యుగంలో ప్రేక్షకుల మారుతున్న అభిరుచులకు అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు స్టార్ పవర్ ఉంటే చాలు సినిమాలు ఆడేవి, కానీ ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని సామాన్య ప్రేక్షకుడు కూడా ప్రపంచ స్థాయి సినిమాలను చూస్తున్నాడు. అందుకే కృత్రిమంగా ఉండే కథలను వారు తిరస్కరిస్తున్నారు. బాలీవుడ్ కేవలం విలాసవంతమైన జీవితాలను, వాస్తవానికి దూరంగా ఉండే పాత్రలను చూపిస్తుంటే, దక్షిణాది చిత్రాలు సామాన్యుడి కష్టాలను, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నాయి. ఈ ‘కనెక్టివిటీ’ లోపించడం వల్లే హిందీ సినిమా సంక్షోభంలో పడిందని, కథలో దమ్ముంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఈ చర్చ స్పష్టం చేస్తోంది.

మార్పు దిశగా అడుగులు పడాల్సిందే:

చివరగా.. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలను కేవలం విమర్శగా కాకుండా ఒక హెచ్చరికగా చూడాలి అని సగటు ప్రేక్షకుడు అభిప్రాయపడుతున్నాడు. సినీ ప్రేమికులు ఇప్పుడు గ్లోబల్ కంటెంట్‌ను చూస్తున్నారు, కాబట్టి పాతకాలపు ఫార్ములా సినిమాలు ఇక వర్కౌట్ కావు. కథలో బలం, పాత్రల్లో నిజాయితీ ఉన్నప్పుడే ఏ పరిశ్రమ అయినా మనుగడ సాగించగలదు.

Advertisement

ALSO READ:Psych Sidhartha: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నందు సైక్ సిద్ధార్థ.. కనీసం ఇక్కడైనా మెప్పిస్తుందా?

ప్లాస్టిక్ మెరుగుల కంటే మట్టి మూలాలు ముఖ్యం.

బాలీవుడ్ తన తప్పులను సరిదిద్దుకుని మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలంటే, ప్లాస్టిక్ మెరుగుల కంటే మట్టి మూలాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు మునుపు కూడా ప్రకాష్ రాజ్ బాలీవుడ్ గురించి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే ..అప్పట్లో ఆయనకు బాలీవుడ్ అవకాశాలు రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ, అక్కడ కొందరు అమ్ముడు పోయారంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్ చేసారు. ఇది ఎలాంటి చర్చకు దారి తీస్తుందో చూడాలి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×