E-Paper
Advertisement

Psych Sidhartha: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నందు సైక్ సిద్ధార్థ.. కనీసం ఇక్కడైనా మెప్పిస్తుందా?

Psych Sidhartha: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నందు సైక్ సిద్ధార్థ.. కనీసం ఇక్కడైనా మెప్పిస్తుందా?
Advertisement

Psych Sidhartha:ప్రస్తుతకాలంలో చాలా సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 లేదా 8 వారాలలోపే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. అయితే ఆ సినిమాలు థియేటర్లలో ఒకవేళ బ్లాక్ బస్టర్ అందుకుంటే డిజిటల్ స్ట్రీమింగ్ కాస్త ఆలస్యం అవుతుంది. ఇకపోతే థియేటర్లలో మెప్పించలేని చిత్రాలు కూడా ఇప్పుడు స్ట్రీమింగ్ కి వచ్చి ఓటీటీ ప్రియులను అలరిస్తున్న విషయం తెలిసింది. ఇకపోతే అలాంటి ఒక చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయింది. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా కనీసం ఓటీటీ లోనైనా మంచి ఆదరణ అందుకుంటుందా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన సైక్ సిద్ధార్థ..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యువ నటుడిగా పేరు దక్కించుకున్న నందు(Nandu ) తాజాగా నటించిన చిత్రం సైక్ సిద్ధార్థ. జనవరి 1వ తేదీన ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటి యామిని భాస్కర్ (Yamini Bhaskar) హీరోయిన్ గా నటించింది .ఇకపోతే ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ప్రియాంక రెబాకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక తదితరులు కీలకపాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అటు థియేటర్లలో ఈ సినిమా మంచి హిట్ అందుకుంటుందని అభిమానులు కూడా అనుకున్నారు. కానీ సినిమా థియేటర్లలో అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది . ట్రైలర్తో పెంచిన అంచనాలు సినిమా ఫుల్ ఫిల్ చేయలేకపోయిందనేది వాస్తవం.

Advertisement

ALSO READ:Raviteja ‘RT 77’: రూట్ మార్చిన రవితేజ.. కొత్త సినిమా టైటిల్ రిలీజ్.. సక్సెస్ అవుతారా?

కనీసం ఇక్కడైనా మెప్పిస్తుందా?

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధం అయ్యింది. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని ఓటీటీ లోకి తీసుకొస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా (Aha ) లో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే థియేటర్లలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీ ప్రియులనైనా మెప్పిస్తుందేమో చూడాలి.

సైక్ సిద్ధార్థ సినిమా స్టోరీ..

Advertisement

సైక సిద్ధార్థ సినిమా స్టోరీ విషయానికి వస్తే సిద్ధార్థ (నందు) ఒక బిజినెస్ లో 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాడు. అయితే ఆ డబ్బును తాను నమ్మి ఇన్వెస్ట్ చేసిన మన్సూర్ , సుఖేష్ రెడ్డి మోసం చేస్తారు. అలాగే సిద్ధార్థ ప్రేయసి త్రిష (ప్రియాంక) ను కూడా లైన్లో పెట్టి తనకు కాకుండా చేశారనే బాధతో అన్ని వదిలేసి ఒక బస్తీకి వెళ్లి ఏ పని చేయకుండా వీడియో గేమ్స్ ఆడుతూ ఆ బస్థీ లోని అందరికీ తలనొప్పిగా మారుతాడు. అయితే భర్త తాగి వచ్చి కొడుతూ ఉండడంతో అతనితో ఉండకూడదని నిర్ణయించుకున్న శ్రావ్య (యామిని భాస్కర్) తన ఎనిమిదేళ్ల కొడుకుని తీసుకొని అదే బస్తీలో సిద్ధార్థ ఇంటి కింద పోర్షన్లో అద్దెకు దిగుతుంది. గొడవలతో మొదలైన వీరి పరిచయం క్రమంగా ప్రేమకు దారితీస్తుంది. త్రిష తనను మోసం చేసి వెళ్లిపోయింది అనే బాధలో ఉన్న సిద్ధార్థ శ్రావ్యా ప్రేమలో పడతాడు.. మరోసారి ప్రేమ వల్ల బాధపడ్డాడా లేక లాభపడ్డాడా? ఆ తర్వాత ఏమయింది? అనే విషయం తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×