Gajulu Gajulu gala gala :గాజులు గాజులు గాజులు గలగల అనే పాట సోషల్ మీడియాని ఎంతలా షేక్ చేసింది చెప్పక్కర్లేదు.ఇక ఇందులో నటించిన రాధమ్మ కూతురు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది.ఇక ఈ పాట వచ్చిన 9 రోజుల్లోనే ఏకంగా 13 మిలియన్ వ్యూస్ దాటేసి మరింత దూసుకుపోతుంది దీంతో ఈ పాట చేసిన రాధమ్మ కూతురు ఒకవైపు ప్రశంసలను దక్కించుకుంటూనే మరియు విమర్శలని కూడా ఎదుర్కొంటుంది.
అమ్మవారి సన్నిధిలో ఆ రీల్ చేయడమేంటి?
ఇక ఇందులో భాగంగా రాధమ్మ కూతురుపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతుంది కల్యాణి అమ్మ . ప్లాస్టిక్ పూలు పెట్టుకొని అమ్మవారి సన్నిధిలో ఆ రీల్ చేయడమేంటంటూ మండిపడింది. దీనికి కౌంటర్ గా మాల తీయగానే చెప్పు చూపిస్తూ రాధమ్మ కూతురు కూడా కౌంటర్ ఇచ్చింది. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణమ్మ తాను అలా ఎందుకు మాట్లాడాను ఏంటి అన్న విషయాలు చెప్పుకొచ్చింది.
రాధమ్మ కూతురు పైన తనకి ఎలాంటి అసూయ లేదని, తను ఫేమస్ కావడంతో నేను అమ్మాయిని ట్రోల్ చేయలేదని, అమ్మాయిపై కామెంట్ చేయడమే తన టార్గట్ కాదని, కేవలం దుర్గ మాత సన్నిధిలో ఉండి అలా ప్లాస్టిక్ పూలు పెట్టుకొని వీడియో చేయడమేంటి అన్న మాటకి ఆ అమ్మాయి నాకు చెప్పు చూపించిందని అందువల్లే నేను మరింతగా అమ్మాయిపై మాట్లాడమని తెలిపింది.
హిందూ సనాతన ధర్మం మంట కలిసి పోతుంది
ఇక ఇప్పటికే హిందూ సనాతన ధర్మం మంట కలిసి పోతుంది అలాంటి ఈ సమయంలో ఈ అమ్మాయి ఇలా దేవుడి సన్నిధిలో అదిగో దుర్గా ,ఇదిగో దుర్గా అంటూ రీల్స్ చేస్తూ భక్తిని మంటగలపడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఫైర్ అయింది. అయితే నేనేదో కొత్తగా ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడింది కాదని గతంలో ఎన్నోసార్లు కృష్ణ కాంత్ పార్కు వద్ద కూడా చాలా ఇష్యులపై గొంతు ఎత్తానని కళ్యాణి టాక్స్ అనే నా యూట్యూబ్ ఛానల్ లోకి చూస్తే ఆ విషయాలన్ని తెలుస్తాయని చెప్పుకొచ్చింది.ఈ అమ్మాయికి అసలు భక్తి లేదని కేవలం దుర్గామాత అని అడ్డం పెట్టుకుని రీల్స్ చేస్తూ సంపాదించుకోవడమే ఈ అమ్మాయికి ముఖ్యమని మండిపడింది కళ్యాణమ్మ.
ఒక్క రాత్రిలోనే మిలియన్ల వ్యూస్
అయితే ఇదిలా ఉండగా మరోవైపు రాధమ్మ కూతురు కూడా గట్టిగానే రియాక్ట్ అవుతుంది .చెప్పు తీయడం మీకు కనిపిస్తుంది కాని, దాని వెనుక ఉన్న నా బాధ మెకెఉ ఎందుకు కనిపించట్లేదు.అయినా ఆ దుర్గమ్మ నే నా పాటకి మెచ్చి, నవ్వుతూ వచ్చి నాతో ఆ పాట పాడించుకుని ఒక్క రాత్రిలోనే మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టేలా ,చేసిందని ,ఇక ఇపుడు ఆ పాట 13మిలియన్స్ క్రాస్ చేసి నన్ను స్టార్ ని చేసిందని,అలాంటి ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీరంతా పెట్టె బ్యాడ్ కామెంట్స్ నన్నేమీ చేయవని కౌంటర్ ఇచ్చింది.
ఈ పంచాయితీ ఎటు మళ్లుతుందో !
అంతే కాదు ఎవరెన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా తగ్గేదిలేదు అంటూ ట్రోలర్స్ కి సాలిడ్ గా కౌంటర్ ఇస్తూ సినిమా పాటల సాంగ్స్ కి డ్యాన్స్ వేసిన వీడియోలు ఇప్పుడు నెట్ లో వైరల్ చేస్తోంది .అయితే ఆ అమ్మాయి ఏదో రీల్ చేసుకుంటే ఇంత రాద్ధాంతం చేయాలా అంటూ కొంతమంది మండిపడుతుంటే ,అసలు ఆ అమ్మాయి అలా చేయడం కరెక్ట్ కాదు అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు చూడాలి మరి ముందు ముందు ఈ పంచాయితీ ఎటు మళ్లుతుందో !
ALSO READ :‘గాజుల గల గల’ సింగర్‌కు ఏమైంది? సోషల్ మీడియాలో ఎందుకీ ట్రోలింగ్?