E-Paper
Advertisement

ఆర్. నారాయణమూర్తి మనసు మార్చిన హుషారు 2..ఎందుకు ఒప్పుకున్నారో ?

ఆర్. నారాయణమూర్తి మనసు మార్చిన హుషారు 2..ఎందుకు ఒప్పుకున్నారో ?
Advertisement

Husharu 2 Teaser:హుషారు సినిమా సక్సెస్ కావడంతో ఇపుడు దానికి హుషారు 2 అంటూ సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ వచ్చింది.ఎప్పటిలాగే యూత్ ని టార్గెట్ చేస్తూ ఎంటర్ టైనింగ్ గానే ప్లాన్ చేశాడు డైరెక్టర్.చూస్తుంటే ఎప్పటిలానే అలా నవ్వులతో, సాగిపోతున్న టీజర్ లో ఒక్కసారిగా పెద్ద సర్ప్రైజ్ రివీల్ అయింది.అదే పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఎంట్రీ.

 సినిమాలలో కనిపించని ఆర్ నారాయణ మూర్తి

Advertisement

అవును..తనవైన సినిమాలలో తప్ప ఇతర దర్శకుల సినిమాలలో కనిపించని ఆర్ నారాయణ మూర్తి ఈ సినిమాలో కనిపించడంలో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారంతా.ఎందుకంటే టెంపర్ వంటి సినిమాకే బ్లాంక్ చెక్ ఆఫర్ చేసినా సినిమాని చేయని ఈ పీపుల్స్ స్టార్ ఇలా హుషారు 2 సినిమాలో కనిపించడంలో నోరెళ్ళ బెట్టేస్తున్నారు. అసలు ఎంత డబ్బులిచ్చినా నేను చేయను అని కుండ బద్దలు కొట్టిన ఆర్ నారాయణ మూర్తిని హుషారు 2 సినిమాకోసం దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి అసలు ఏం చెప్పి సినిమాలో నటించేలా ఒప్పించాడా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు నెటిజన్లు.

 ఇండస్ట్రీలో మరొకరు ఉండరు

Advertisement

నిజానికి ఆర్ నారాయణ మూర్తి గనుక డబ్బే ప్రధానంగా భావించి సినిమాలు చేసుకుంటూ పొతే ఆయనంత బిజీ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో మరొకరు ఉండరంటే ఆశ్చర్యం లేదు.కానీ ఏనాడు కూడా డబ్బులు ముఖ్యమని భావించకుండా తాను నమ్మిన సిద్దాంతాలే తనకు ముఖ్యమని భావించి తొలినాళ్ళలో తప్ప ఆ తర్వాత మరొకరి సినిమాలలో కనిపించని నారాయణమూర్తి హుషారు 2 లో కనిపించడం అంటే మిరాకిల్ అనే చెప్పుకోవాలి.

ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు

అయితే సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో నడవడం, అందులో ఆర్ నారాయణ మూర్తి ప్రధాన పాత్ర పోషించడం వంటివి ఆయన్ని ఆకర్షించవచ్చు గాక ,కానీ ఇలాంటివి చాలా సినిమాలే వచ్చి ఉన్నాయి.ఇక అందుకోసం ఆర్ నారాయణ మూర్తిని అడిగి ఉండి కూడా.అలా ఆయన్ని తమ తమ సినిమాల్లోకి తీసుకురావడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడా ఒకే చెప్పని ఈ పీపుల్స్ స్టార్ హుషార్ 2 సినిమాలో మెరిసేలా చేయగలిగాడంటే దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మెచ్చుకొని తీరాల్సిందే.

ఇంకెన్ని సినిమాలలో దర్శనం ఇస్తాడో!

అయితే సినిమా కథనే ఆర్ నారాయణ మూర్తిని బాగా మెప్పించి ఉండాలి తప్ప, ఆయన నటించడానికి మరే కారణం ,అందునా డబ్బు అనే కారణం అస్సలు అయ్యుండదు అన్న టాక్ ఇపుడు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుంది. ఏది ఏమైనా ఎంత మంది అడిగినా, ఎంత డబ్బు ఆఫర్ చేసినా ఎక్కడా తలొగ్గని ఈ పీపుల్స్ స్టార్ ఇలా హుషారు 2 సినిమాలో కనిపించడం అటు పీపుల్స్ స్టార్ అభిమానులని,ఇటు మూవీ లవర్స్ ని హ్యాపీ మోడ్ లో పెట్టేసింది. చూడాలి మరి తమ్ముళ్ళు వేట మొదలెడదామా అంటూ నటించడం మొదలెట్టిన ఆర్ నారాయణ మూర్తి ముందు ఇంకెన్ని సినిమాలలో దర్శనం ఇస్తాడో!

ALSO READ :హిట్ పాటలు.. భారీ క్రేజ్.. రామ్ మిరియాల ఒక్కో పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Tags

Related News

నితిన్ అలియాస్ రుక్మిణి నుంచి రుక్కు రుక్కు రుక్మిణి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

‘హుషారు 2’ టీజర్.. ఇలా ఉందేంటి భయ్యా? ఆ పాత్రలో ఆర్ నారాయణమూర్తి!

హిట్ పాటలు.. భారీ క్రేజ్.. రామ్ మిరియాల ఒక్కో పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

కావ్య అనిరుద్ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూశారా? కాస్ట్ ఎంతో తెలిస్తే మతి పోవాల్సిందే!

సీతారామం ఫస్ట్ ఛాయిస్ మృణాల్ కాదా..ఇన్నాళ్ళు బయట పెట్టిన సీత!

చిరంజీవి టాక్ షో ‘మెగా వర్స్’ షూటింగ్ నేడే ప్రారంభం.. ఫస్ట్ గెస్ట్ లు వీళ్ళే!

పెళ్లితో వార్తల్లోకి వచ్చిన అర్జున్ చిన్న కూతురు..ఆమె చేసే బిజినెస్ ఏంటో తెలుసా ?

Big Stories

Advertisement
×