E-Paper
Advertisement

ప్రీతి అందాల జాతర మామూలుగా లేదుగా.. చూపు తిప్పుకోవడం కష్టమే!

ప్రీతి అందాల జాతర మామూలుగా లేదుగా.. చూపు తిప్పుకోవడం కష్టమే!
Advertisement

Preethi Asrani:ప్రీతి అస్రాని..సినిమాల్లో తన యాక్టింగ్‌తో మెప్పిస్తూనే, సోషల్ మీడియాలో తన అందంతో యూత్ ని ఫిదా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈక్రమంలో తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. లైట్ గ్రీన్ కలర్ చీరలో, ముత్యాల డిజైన్‌తో ఉన్న బ్లౌజ్‌లో ప్రీతి కనిపించిన తీరు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుందనడంలో సందేహం లేదు.

సింపుల్‌గా కనిపిస్తూనే క్లాసీగా ఎలా కనిపించవచ్చో మరోసారి ప్రూవ్ చేసింది ఈ భామ.ఇక ఈ ఫొటోల్లో కట్టుకున్న లేత ఆకుపచ్చ రంగు చీరకి ముత్యాల వర్క్ యాడ్ అవ్వడంతో లుక్‌కు రిచ్‌నెస్ వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా బ్లౌజ్ మీద చేసిన పెర్ల్ డిజైన్, చీర అంచుల మీద ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఈ అమ్మడి అందాన్ని డబల్ చేసేసింది.

Advertisement

ఇక చెవులకు చిన్న ముత్యాల కమ్మలు పెట్టుకుని, జుట్టును సింపుల్‌గా వదిలేసి,న్యాచురల్ మేకప్ తో కనిపించి ఆడియన్స్ ని ఫిదా చేసేసింది.ఇక ఈ లుక్ రావడానికి కష్టపడ్డ టీమ్ మెంబర్స్ పేర్లని కూడా షేర్ చేసి ఈ లుక్ కోసం కష్టపడ్డవారిని గుర్తించింది ఈ భామ.

ఇక ప్రీతి అస్రాని సినీ కెరీర్ విషయానికి వస్తే .చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామకి 2013లో వచ్చిన ‘గుండెల్లో గోదారి’ మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘మళ్లీ రావా’ సినిమాలో చిన్ననాటి అంజలి రోల్‌లో కనిపించి తనని తాను ప్రూవ్ చేసుకుంది.ఇందులో చిన్న రోల్ అయినా ఆడియెన్స్‌కు బాగా గుర్తుండిపోయింది అంటే ఈ అమ్మడి ఫెర్ఫామెన్స్ ఆడియన్స్ ని ఎంతలా అలరించిందో అర్థమవుతుంది.

Advertisement

ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’లోనూ నటించి హీరోయిన్‌గా మంచి బ్రేక్ కోసం ట్రై చేస్తూనే ఉంది.ఈ క్రమంలోనే 2020లో వచ్చిన ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాలో లీడ్ రోల్ చేసింది. అలా ‘A: అడ్ఇన్ఫినిటమ్’, ‘సీటీమార్’ సినిమాల్లో నటించి తన రేంజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేసింది ప్రీతి.ఇక ఈ క్రమంలోనే సమంత లీడ్ రోల్‌లో చేసిన ‘యశోద’ సినిమాలో బ్రిందా క్యారెక్టర్ చేయడం ఆమె కెరీర్‌లో మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

ఇక తమిళంలో వచ్చిన ‘అయోతి’ మూవీ ప్రీతి కెరీర్‌లో మరో మంచి సినిమాగా నిలిచిపోయింది.ఇక ఈ సినిమాతోనే గ్లామర్ రోల్స్‌కే కాకుండా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రల్లోనూ నటించగలనని ప్రూవ్ చేసుకుంది ఈ అమ్మడు.పైగా ఆ సినిమాకు తమిళంలో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్‌గా సైమా అవార్డు కూడా అందుకుందండోయ్.

ఆ తర్వాత ‘ఎలక్షన్’, ‘కిస్’, మలయాళ మూవీ ‘బల్టీ’ వంటి సినిమాలతో బిజీగా మారి పోయిన ఈ భామ 2026లో ‘29’, ‘అప్పా కుట్టి’, ‘నీరం’ సినిమాలతో ఆడియెన్స్ ని మరోసారి పలకరించింది.మొత్తంగా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్‌తో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ తనకంటూ ఒక ప్లేస్ సంపాదించుకోవాలని ట్రై చేస్తోందని ఈ అమ్మడి సినీ లైనప్ చూస్తేనే అర్థం అవుతుంది.చూడాలి మరి టాప్ లీగ్ పై గురిపెట్టిన ఈ అందాల భామ దాన్ని ఎప్పుడు అందుకుంటుందో !

ALSO READ:హనుమాన్ 2 రైట్స్ వివాదంపై నిర్మాత క్లారిటీ.. రూ.23 కోట్ల సెటిల్మెంట్ వార్తల్లో నిజమెంత?

Tags

Related News

హనుమాన్ 2 రైట్స్ వివాదంపై నిర్మాత క్లారిటీ.. రూ.23 కోట్ల సెటిల్మెంట్ వార్తల్లో నిజమెంత?

అమెరికా వెళ్లినా పెరుగు అన్నం కావాల్సిందే.. భార్య గురించి సీక్రెట్స్ బయటపెట్టిన రాజశేఖర్!

టాలీవుడ్ హీరోలపై ‘అలియాస్ రుక్మిణి’ బ్యూటీ కామెంట్స్!

‘అలియాస్ రుక్మిణి’ నా వ్యక్తిగత జీవితానికి కనెక్ట్ అయ్యింది: ఆఫియా సయ్యద్

క్లిన్ కారా చదువుతున్నది సమంత స్కూల్లోనేనా.. ఉపాసన పోస్టు వైరల్!

తొలిసారి IFFIకి వెళ్లిన సాన్వే మేఘన.. అక్కడి అనుభవం ఎలా ఉందంటే!

మహిళలంటే రోబోలు కాదు.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×