E-Paper
Advertisement

హనుమాన్ 2 రైట్స్ వివాదంపై నిర్మాత క్లారిటీ.. రూ.23 కోట్ల సెటిల్మెంట్ వార్తల్లో నిజమెంత?

హనుమాన్ 2 రైట్స్ వివాదంపై నిర్మాత  క్లారిటీ.. రూ.23 కోట్ల సెటిల్మెంట్ వార్తల్లో నిజమెంత?
Advertisement

Hanuman 2 Rights:‘హనుమాన్’…చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు స్ప్రుష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమా ఒకరకంగా టాలీవుడ్ రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇక ఈ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌పై, ముఖ్యంగా సీక్వెల్ ‘జై హనుమాన్’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

అయితే ప్రశాంత్ వర్మ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ‘జై హనుమాన్’ అనౌన్స్ చేసినప్పటి నుంచి, ‘హనుమాన్ 2’ రైట్స్ విషయంలో ఇండస్ట్రీలో రకరకాల వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి.అసలు ఈ సీక్వెల్ హక్కులు ‘హనుమాన్’ నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ (నిరంజన్ రెడ్డి) దగ్గర ఉన్నాయా? లేక ప్రశాంత్ వర్మ దగ్గరే ఉన్నాయా? అన్న డౌట్స్ ట్రేడ్ వర్గాల్లో ఎప్పటి నుండో నానుతున్నాయి.

Advertisement

ఇక తాజాగా ఇదే విషయంపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత చైతన్య రెడ్డిని శ్రీమతి ఈవెంట్ లో అడగగా ఇలా ఆసక్తికరమైన సమాధానం చెప్పుకొచ్చారు. ప్రశాంత్ వర్మతో రూ.23 కోట్లకు సెటిల్మెంట్ జరిగిందని, అందుకే రైట్స్ వదులుకున్నారని వస్తున్న వార్తల్లో నిజమెంత అని అడగ్గా ఇందులో ఎలాంటి దాపరికాలు లేవని, ప్రతి విషయానికి సంబంధించిన డాక్యుమెంట్లు తమ దగ్గర పక్కాగా ఉన్నాయని స్పష్టం చేశారు. అవసరమైతే తన ఆఫీసుకి వస్తే అన్ని పేపర్లు చూపిస్తానని, మీడియాకు కూడా వివరాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్పారు.

ఇక రూ.23 కోట్ల సెటిల్మెంట్ వార్తలపై మాట్లాడుతూ.. అది కేవలం సెటిల్మెంట్ వ్యవహారం మాత్రమే కాదని, దాని వెనుక చాలా అంశాలు ఉన్నాయని చైతన్య రెడ్డి తెలిపారు. ‘హనుమాన్’ అనేది ఎవరో ఒకరి సొంతం కాదని, దీనికి సంబంధించి చాలామందికి వేర్వేరు హక్కులు, ఉన్నాయని చెప్పడం విశేషం.

Advertisement

ఇక ‘హనుమాన్’ రైట్స్ తమ దగ్గర ఉన్నాయని, ప్రశాంత్ వర్మకు ఉండాల్సిన హక్కులు ఆయన దగ్గరే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం తాము వేరే సినిమాలతో బిజీగా ఉన్నామని, సరైన టైమ్ వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుకుందామని స్కిప్ చేసేసింది ఈ లేడీ ప్రొడ్యూసర్.

ఇక ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ జర్నీ గురించి మాట్లాడుతూ చిన్న సినిమాలతో మొదలైన తమ బ్యానర్‌కు ‘హనుమాన్’ పెద్ద గుర్తింపు తెచ్చిందని, ఇప్పుడు పెద్ద స్థాయి ప్రొడక్షన్ హౌస్‌గా ఎదగడానికి ఈ సినిమానే కారణమని చెప్పారు. తాము హీరోలను కాకుండా కథలను నమ్మి సినిమాలు చేస్తామని, ‘హనుమాన్’, ‘ఎస్‌వైజీ’తో పాటు ప్రస్తుతం చేస్తున్న ‘బిల్లా రంగ భాషా’ కూడా కథ మీదున్న నమ్మకంతోనే తీస్తున్నామని వివరించారు.

అలాగే ఓటీటీ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నామని, థియేటర్ అయినా డిజిటల్ అయినా క్వాలిటీ విషయంలో నిరంజన్ రెడ్డి అస్సలు కాంప్రమైజ్ కారని చెప్పారు. మొత్తానికి ‘హనుమాన్ 2’ రైట్స్ విషయంలో చైతన్య రెడ్డి ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. చూడాలి దీనిపై ప్రశాంత్ వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో !

also read :అమెరికా వెళ్లినా పెరుగు అన్నం కావాల్సిందే.. భార్య గురించి సీక్రెట్స్ బయటపెట్టిన రాజశేఖర్!

Tags

Related News

అమెరికా వెళ్లినా పెరుగు అన్నం కావాల్సిందే.. భార్య గురించి సీక్రెట్స్ బయటపెట్టిన రాజశేఖర్!

టాలీవుడ్ హీరోలపై ‘అలియాస్ రుక్మిణి’ బ్యూటీ కామెంట్స్!

‘అలియాస్ రుక్మిణి’ నా వ్యక్తిగత జీవితానికి కనెక్ట్ అయ్యింది: ఆఫియా సయ్యద్

క్లిన్ కారా చదువుతున్నది సమంత స్కూల్లోనేనా.. ఉపాసన పోస్టు వైరల్!

తొలిసారి IFFIకి వెళ్లిన సాన్వే మేఘన.. అక్కడి అనుభవం ఎలా ఉందంటే!

మహిళలంటే రోబోలు కాదు.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్!

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. పెద్ద స్కెచ్ వేశారుగా?

Big Stories

Advertisement
×