E-Paper
Advertisement

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.. టెంపర్ వంశీకి చుక్కలు చూపించిన శివాజీ!

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.. టెంపర్ వంశీకి చుక్కలు చూపించిన శివాజీ!
Advertisement

Bigg Boss Buzzz Vamsi: బిగ్ బాస్ 10 తెలుగు కార్యక్రమంలో భాగంగా 12 వ వారం హౌస్ నుంచి టెంపర్ వంశీ (Temper Vamsi)ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇలా బిగ్ బాస్ హౌస్ లో 12 వారాలు పాటు కొనసాగిన ఈయన సంతోషంగానే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమం నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు నేరుగా బజ్ కార్యక్రమంలో పాల్గొంటారు. తాజాగా వంశీ కూడా శివాజీ(Sivaji) హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ (Bigg Boss Buzzz)కార్యక్రమంలో పాల్గొన్నారు.

జనం దృష్టిలో అది క్రైమ్..

ఈ కార్యక్రమంలో భాగంగా శివాజీ వంశీ గురించి పెద్దగా ఎలివేషన్లు ఇస్తూ తనని ఆహ్వానించారు.. బిగ్ బాస్ వెళ్లిన తర్వాత చాలా బాగా తగ్గిపోయావు అంటూ అడగడంతో అవునని వంశీ సమాధానం ఇచ్చారు. అయితే వెంటనే శివాజీ హౌస్ లో ఏమాత్రం తగ్గలేదులే అంటూ కామెంట్ చేశారు. మొన్న జరిగిన నామినేషన్ కారణంగానే నువ్వు ఎలిమినేట్ అయ్యావు అంటే నువ్వేమని చెబుతావు అంటూ శివాజీ అడగగా జనాలు మనకంటే పదింతలు ఆలోచిస్తారు. మనం 99 మంచి పనులు చేసి ఒక మంచి పని చేయకపోయినా ఎలిమినేట్ చేస్తారంటూ మాట్లాడారు. మనం రైమ్ కోసం మాట్లాడితే అది జనం దృష్టిలో క్రైమ్ లాగా కనిపిస్తుందంటూ శివాజీ తెలిపారు.

సేవ్ చేసిన ముఖేష్ కు వెన్నుపోటు..

Advertisement

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి లేదంటే ఎలా ఉంటుందో వంశీని చూసి నేర్చుకోవచ్చు అంటే నీ సమాధానం ఏంటని అడగగా నేను అసలు ఒప్పుకోనని వంశీ సమాధానం చెప్పారు. థర్డ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ముఖేష్ సేవ్ చేసినప్పుడు ముఖేష్ తో కాకుండా త్రిగుణ్ వైపుకు చేరిపోయావు. ఇది ఆడియన్స్ కి వేరే విధంగా వెళ్లిపోయింది.. మంచి చేసిన వ్యక్తికి కూడా మోసం చేస్తున్నావని భావన ప్రేక్షకులలో ఉంటుందని శివాజీ చెప్పడంతో అప్పటికే వర్షిని ఝాన్సీ ముఖేష్ కి దగ్గర కావడంతో వారి స్పేస్ లోకి నేను వెళ్ళాలనుకోలేదు అంటూ వంశీ చెప్పారు.

Advertisement

రోహిత్ శాలిని నోరు జారడం వల్ల తాను నామినేట్ చేశానని చెప్పారు. మరి అదే నోరు ప్రతిసారి త్రిగుణ్ నోరు జారుతున్నారు. ఎందుకు నామినేట్ చేయలేదు అంటూ వరుస ప్రశ్నలతో వంశీని శివాజీ ప్రశ్నించారు. ఫ్రెండ్ అనే ఉద్దేశంతోనే నామినేట్ చేయలేదా? అంటూ వరుస ప్రశ్నలు వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. మరి ఈ ప్రశ్నలకు వంశీ ఎలాంటి సమాధానం చెప్పారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల గురించి వంశీ అభిప్రాయం ఏంటి విన్నర్ ఎవరు అవతారు అనే విషయాల గురించి వంశీ ఏం చెప్పారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read: బిగ్ బాస్ డబుల్ ట్విస్ట్.. వంశీతో పాటు మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్?

Related News

బిగ్ బాస్ డబుల్ ట్విస్ట్.. వంశీతో పాటు మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్?

బిగ్ బాస్ 10 విన్నర్ త్రిగుణ్…ఫుల్ సపోర్ట్ చేస్తున్న టాలీవుడ్ హీరో?

అసలు ఈ పాటలో ఏముందిరా మావా.. ఇంతలా వైరల్ అవుతోంది!

గాజులు గలగలతో వచ్చిన క్రేజ్.. అయ్యప్ప పాటతో మొత్తం రివర్స్!

శోభితను ఎప్పుడైనా అలా పిలిచావా.. నాగార్జున ప్రశ్నకు షాక్ అయిన చైతు!

త్రిగుణ్ తో నాకు పోటీ ఏంటి?: ముఖేష్

బిగ్ బాస్ నుండి టెంపర్ వంశీ ఎలిమినేటెడ్!

Big Stories

Advertisement
×