E-Paper
Advertisement

అమెరికా వెళ్లినా పెరుగు అన్నం కావాల్సిందే.. భార్య గురించి సీక్రెట్స్ బయటపెట్టిన రాజశేఖర్!

అమెరికా వెళ్లినా పెరుగు అన్నం కావాల్సిందే.. భార్య గురించి సీక్రెట్స్ బయటపెట్టిన రాజశేఖర్!
Advertisement

Rajasekhar Jeevitha:రాజశేఖర్..సినిమాల్లో యాంగ్రీ యంగ్‌మన్‌గా క్రేజ్ సంపాదించిన ఈ వెటరన్ స్టార్ బయట మాత్రం ఎంత సరదాగా ఉంటాడో చెప్పక్కర్లేదు ఇక తాజాగా తిరువీర్, నివేదా థామస్ నటించిన ‘శ్రీమతి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఇదే మరోసారి ప్రూవ్ అయింది. ఈ ఈవెంట్ కి తన భార్య జీవితతో కలిసి రాగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు రాజశేఖర్ ఇచ్చిన ఫన్నీ ఆన్సర్స్, మధ్యలో జీవిత వేసిన పంచ్‌లు ఆడియెన్స్‌ను నవ్వుల్లో ముంచెత్తాయి.

మొదటగా జీవిత గురించి మీకు ఎంతవరకు తెలుసంటూ సుమ ఒక క్విజ్ పెట్టగా తన భార్య గురించి తనకు అంతా తెలుసని రాజశేఖర్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పడం విశేషం.ఇక పెళ్లయి ఎన్ని ఏళ్లయిందని అడిగితే మాత్రం మర్చిపోయానంటూ చెప్పడంతో నవ్వులు కురిశాయి. కానీ పెళ్లి జరిగిన ఏడాది 1991 అని, జీవిత పుట్టినరోజు సెప్టెంబర్ 2 అని టక్కున కరెక్ట్‌గా చెప్పేశాడు ఈ యాంగ్రీ యంగ్‌మన్‌.

Advertisement

.ఇక జీవిత బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ‘నేనే’ అని రాజశేఖర్ అనగానే అందరూ నవ్వారు. జీవిత కూడా దానికి అవునని తలూపేసింది.
ఇకపోతే రాజశేఖర్‌కు వంట వచ్చా అని అడిగితే.. చపాతీలు, దోసెలు, ఆమ్లెట్ సూపర్‌గా చేస్తారని, అంతేకాదు వేడినీళ్లు కూడా బాగా కాస్తారని జీవిత సరదాగా కౌంటర్ వేయడంతో స్టేజ్ మీద మరో సారి నవ్వులు కురిశాయి.

ఇక ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, అమెరికా అయినా ఆఫ్రికా అయినా సరే.. తనకు చివరికి పెరుగు అన్నం ఉండాల్సిందేనని రాజశేఖర్ తన ఫుడ్ సీక్రెట్ చెప్పారు. జీవితకు తన సినిమాల్లో ‘ఎవడైతే నాకేంటి’ బాగా ఇష్టమని రాజశేఖర్ చెబితే.. ‘అంకుశం’, ‘ఆహుతి’, ‘శేషు’ కూడా తన ఫేవరెట్స్ అని జీవిత చెప్పుకొచ్చారు.

Advertisement

ఇక కోపం వస్తే జీవితను పక్క గదిలో ఉండమంటానని, కానీ కాసేపటికే బాధేసి ఆమె తొంగి చూస్తున్నా కోపంగా ఉన్నట్లే నటిస్తానని సరదా గా చెప్పుకొచ్చాడు రాజశేఖర్.ఇక జీవితకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ‘నేనే’ అంటూ పంచ్ వేయడం అందరిని కడుపుబ్బా నవ్వించింది. ఇక ‘శ్రీమతి’ సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చానని, సినిమా టైటిల్, పోస్టర్ చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు.

ఇక ఈ సందర్భంగా తల్లిదండ్రులకు సలహా ఇస్తూ పిల్లలు పెద్దయ్యాక వాళ్ల ఇష్టాలను గౌరవించాలని, అందరూ డాక్టర్లు, ఇంజినీర్లే అవ్వాలని రూల్ లేదని చెప్పారు. ఇద్దరు కూతుళ్ల తండ్రిగా ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగిన అమ్మాయిలు పెళ్లయ్యాక కొత్త ఇంటికి వెళ్లాలంటే భయపడతారని, అప్పుడు భర్తతో పాటు అత్తమామలు కూడా వాళ్లను అర్థం చేసుకోవాలని సూచించారు.

ఇక 2026లోకి వచ్చినా ఇంకా ఆడ, మగ తేడాలు, పెళ్లిలో అమ్మాయి వయసు తక్కువ ఉండాలనే పాత ఆలోచనలు ఎందుకని ప్రశ్నించారు. ఒక ఇంటిని నడిపించడంలో భార్య పాత్ర చాలా గొప్పదని, ఆమె పనుల్లో భర్త కూడా సాయం చేస్తూ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే కుటుంబం బాగుంటుందని చెప్పారు. మొత్తానికి ఈ ఈవెంట్‌లో ఒకవైపు నవ్వులతో పాటు, మరోవైపు ప్రతి కుటుంబానికి అవసరమైన మంచి మెసేజ్ ఇచ్చి రాజశేఖర్ అందరి మనసు గెలుచుకున్నాడనే చెప్పాలి.

also read :తొలిసారి IFFIకి వెళ్లిన సాన్వే మేఘన.. అక్కడి అనుభవం ఎలా ఉందంటే!

Tags

Related News

హనుమాన్ 2 రైట్స్ వివాదంపై నిర్మాత క్లారిటీ.. రూ.23 కోట్ల సెటిల్మెంట్ వార్తల్లో నిజమెంత?

టాలీవుడ్ హీరోలపై ‘అలియాస్ రుక్మిణి’ బ్యూటీ కామెంట్స్!

‘అలియాస్ రుక్మిణి’ నా వ్యక్తిగత జీవితానికి కనెక్ట్ అయ్యింది: ఆఫియా సయ్యద్

క్లిన్ కారా చదువుతున్నది సమంత స్కూల్లోనేనా.. ఉపాసన పోస్టు వైరల్!

తొలిసారి IFFIకి వెళ్లిన సాన్వే మేఘన.. అక్కడి అనుభవం ఎలా ఉందంటే!

మహిళలంటే రోబోలు కాదు.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్!

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. పెద్ద స్కెచ్ వేశారుగా?

Big Stories

Advertisement
×